Akshaya Trutiya: ప్రతీ ఏడాది అక్షయ తృతీయ ఏరోజున వస్తుంది? ఆ రోజున బంగారం కొనడానికి కారణం ఏంటి?

అక్షయ తృతీయ ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్షం తదియ రోజు అకృయ తృతీయ జరుపుకుంటారు. 2024 ఏడాదిలో మే 10న అక్షయ తృతీయ నిర్వహించుకోనున్నారు.

Written By: Chai Muchhata, Updated On : May 1, 2024 1:21 pm

Akshaya Tritiya

Follow us on

Akshaya Trutiya: ఆధ్యాత్మికం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది ఎన్ని పనులు ఉన్నా.. కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలు వ్రతాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. పండుగలు మాత్రమే కాకుండా తెలుగు క్యాలెండ్ ప్రకారం కొన్ని రోజులు ప్రత్యేకమైనవి. వీటిలో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఈరోజున ఎక్కువగా బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు. బంగారం కొనడం ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి? అని. అసలు అక్షయ తృతీయ ఏరోజున వస్తుంది? ఆ రోజున ఇంకేం పనులు చేస్తారు?

అక్షయ తృతీయ ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్షం తదియ రోజు అకృయ తృతీయ జరుపుకుంటారు. 2024 ఏడాదిలో మే 10న అక్షయ తృతీయ నిర్వహించుకోనున్నారు. ఈరోజున ఉదయం 4.17 గంటలకు ప్రారంభమై మే 11న ఉదయం 2.50 వరకు ముగుస్తుంది. వీటిలో శుభగడియలు శుక్రవారం ఉదయం 5.49 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.23 గంటల వకు శుభ సమయం ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేపట్టినా అనుకూలంగా ఉంటుంది.

అక్షయ తృతీయ రోజు గ్రాము బంగారమైనా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజున మహా లక్ష్మి అమ్మవారిని పూజిస్తే ఫలితాలు ఉంటాయి. మహా లక్ష్మీ కొలువైన బంగారం కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ దేవతను ఆహ్వానించినట్లవుతుందని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.

అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పుస్తకావిష్కరణ, పిల్లలను మొదటిసారిగా పాఠశాలలో చేర్పించుట, కొత్త స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇక అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కాకుండా వెండి కొనుగోలు చేసినా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం.