Today Horoscope In Telugu: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. ఇందులో భాగంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఏ సమయంలో గురుడు, చంద్రుడు కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. మరికొన్ని రాసిన వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఏదైనా పని ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగం లో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పనిని ప్రారంభించే వారికి ఇదే మంచి అనుకూల సమయం. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే వెంటనే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల కెరీర్ పై దృష్టి పెడతారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. ఇప్పటివరకు చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయడంతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): వ్యాపారాలు అనుకున్న విజయం సాధిస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బకాయిలన్నీ వసూలు అవుతాయి. పిల్లల కెరీర్ పై శుభవార్తలు వింటారు. సాయంత్రం వాహనాన్ని నడపాసి వస్తే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టాలని అనుకునే వారికి పెద్దల సలహా అవసరం. ఆర్థికంగా మిరుగైన ఫలితాలు సాధిస్తారు
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. జీవిత భాగస్వామితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు గొడవలు తెచ్చుకోకుండా సమస్యలు వెంటనే పరిష్కరించుకోవాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సొంత తెలివితేటలతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారాలకు అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను పూర్తి చేసుకోవాలి. కొందరు వ్యాపారుల పనులకు అడ్డంకులు సృష్టిస్తారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు మద్దెల సలహా తీసుకోవడం మంచిది. దుబారా ఖర్చులు పెరిగే అవకాశం. అందువల్ల ఆచూ చూసి వ్యవహరించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు కొందరు తలనొప్పిగా తయారవుతారు. ఇలాంటి వారిని దూరం చేసుకోవడమే మంచిది. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు స్థానచణం కోసం ఆలోచిస్తారు. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని పనుల వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులకు ఇదే మంచి సమయం. చేపట్టిన వెంటనే పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు కొందరు ప్రత్యర్థులు ఎదురవుతారు. కొన్ని పనులు చేయకుండా అడ్డుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. వ్యాపారులకు ఇబ్బందులు ఉండే అవకాశం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగులు కార్యాలయాల్లో సంతోషంగా ఉంటారు. అయితే కుటుంబ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. కానీ మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారులకు అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. అయితే కొందరు పనులకు అడ్డుపడే అవకాశం ఉంది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు బిజీగా ఉంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంకా గొడవ జరిగితే మౌనంగా ఉండడమే మంచిది. లేకుంటే పెద్దదిగా మారే అవకాశం ఉంది. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని వ్యాధులకు వైద్యులను సంప్రదించడమే మంచిది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులు చేపట్టడం ద్వారా వాటికి ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు కేసుల్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొందరు సీనియర్ల సహకారంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలో పాల్గొంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం. అయితే ఈ సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటారు. వారి కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించనుంది. కొన్ని ఖర్చులు పెరిగిన ఆదాయం రావడంతో పెద్దగా సమస్యలు ఉండవు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారిని సంతోష పెట్టడానికి విహారయాత్రలకు తీసుకెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.