‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గజకేసరి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు పెండింగ్ సమస్యలు పూర్తవుతాయి. ఉద్యోగులు వాయిద్యంతో పనులు చేయవద్దు. అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. తల్లి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వివాహేతులకు ప్రతిపాదనలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. ప్రతిభ ఉన్నవారికి ప్రమోషన్ దక్కే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విద్యారంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. ఏదైనా వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. వివాహ ప్రతిపాదనలు వస్తుంటాయి. పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులు సోదరులతో కలిసి కొత్త పెట్టుబడులు పెడతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రయాణాలు చేసేవారు అజాగ్రత్తగా ఉండొద్దు. కొన్ని పనులు కారణంగా మానసికంగా ఒత్తిడితో ఎదుర్కొంటారు. ఇతరుల సలహా పాటించిన తర్వాతే పెట్టుబడులకు ముందుకు వెళ్లాలి. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకుంటే వెంటనే తిరిగి చెల్లించాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగులకు పదోన్నతి విషయంలో అడ్డంకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో సానుకూల వార్తలు వింటారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. దీంతో ఆందోళన చెందుతారు. డబ్బులు ఆధార్ చేయడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండే అవకాశం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే సులువుగా విజయం సాధించలేరు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారానికి మార్గం ఏర్పడతాయి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : జీవిత భాగస్వామి మద్దతుతో వ్యాపారాలు కొత్త పెట్టుబడును పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి. కొందరు కావాలనే విమర్శలు చేస్తారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : మానసికంగా ఆందోళనతో ఉంటారు. వ్యాపారులో కొత్త పెట్టుబడిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. సమయాన్ని వృధా చేసుకోకుండా చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. పిల్లల కేరీర్ కు సంబంధించి శుభవార్తను వింటారు. వ్యాపారులకు అనుకూల వాతావరణ ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాహాల గురించి శుభవార్తలు వింటారు. ఇంట్లో జరిగే శుభక్రమాల కోసం బిజీగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి మద్దతుతో వ్యాపారులు కొత్తపెట్టబడులు పెడతారు. కొన్ని అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులకు శుభ ఫలితాలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.