Today Horoscope In Telugu: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాశులపై జేష్ట్య, మూల నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు మకర రాశిలో బుధుడు ప్రయాణించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న లక్ష్యాలు పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉండడంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తెలియని వివాదాల్లో అసలే దూరొద్దు. కుటుంబంలో పెద్దలతో కలిసి వ్యాపారుల పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసికంగా ఆందోళనలతో ఉంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన మార్పుల ద్వారా లాభాలు పొందుతారు. ఇంటి అవసరాలను తీర్చుకోవడానికి ఖర్చులు చేస్తారు. వినోదాల కోసం స్నేహితులతో కలుస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : మధ్యాహ్నం నుంచి అనారోగ్యంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. భూ తగాదాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. వ్యాపారులకు స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా బలహీనంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు అనుకూల వాతావరణం. ఏ పని చేపట్టిన వెంటనే పూర్తి అవుతుంది. అయితే కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్తిక వ్యవహారాల విషయంలో ఎవరిని నమ్మొద్దు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మధ్యాహ్నం తర్వాత విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు ఉద్యోగుల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. సాయంత్రం కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా వాటిని పరిష్కరించుకుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. పాత స్నేహితులను కలవడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రియమైన వారి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సంఘటనల వల్ల మనసు ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఊహించని ఖర్చులు ఉంటాయి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కొన్ని పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. దీంతో చాలా వరకు నష్టపోతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇరుగుపొరుగు వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన ఒప్పందాల విషయంలో కొత్త వ్యక్తులను నమ్మొద్దు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది. అనారోగ్యం కారణంగా మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. మాటల ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మార్గాల నుంచి డబ్బు అందుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారం కోసం ప్రయాణాలు చేస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల ప్రవర్తనతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తెలియని గొడవలకు దూరంగా ఉండాలి. ప్రభుత్వ పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ప్రయోజనాలకు బదులు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది.