Horoscope Today(2)
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో త్రిపుష్కర యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకున్న ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూల సమయం. లక్ష్యాలు పూర్తి చేయడంతో పదోన్నతులు పొందే అవకాశం. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వీటి పరిష్కారానికి పెద్దల సలహా తీసుకోవాలి. తల్లిదండ్రుల సలహాతో అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. సీనియర్ల సహకారం ఉంటుంది. అయితే కొంతమందితో ఉపయోగాలు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కుటుంబ జీవితంలో కలహాలు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఓపికతోనే పనులు చేయాలి. కొన్ని అవసరాలకు దన సహాయాన్ని బంధువుల నుంచి పొందుతారు. అయితే దానిని వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇంటి అవసరాల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల భవిష్యత్తు పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే అది తక్కుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కొత్తగా లాభాలు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారికి పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. నీతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైన ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల సహాయంతో కొన్ని లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో కార్యాలయాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఇంట్లో ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తను వింటారు. సోదరులు సోదరీమణులతో వ్యాపారం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తుల పరిచయం అయిన వారితో అప్పుడే రహస్యాలు పంచుకోవద్దు. మాటలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కొన్ని పనులు ఇష్టం లేకపోయినా పూర్తి చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. దీంతో మానసికంగా ఆందోళన చెందుతారు. అయితే పూర్వీకుల ఆస్తి విషయంలో సమాచారం మనసు ఉల్లాసంగా మారుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. కొందరికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటారు. కొన్ని కొత్త ప్రాజెక్టుల్లో ప్రారంభిస్తారు. ఓ వ్యక్తి ద్వారా అధికంగా వ్యాపారాలు లాభాలు సాధిస్తారు. రాజకీయ నాయకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మాటలు మాధుర్యాన్ని కాపాడుకోవాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ధనుస్సు రాశి వారు ఈ రోజు అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో విభేదాలు ఉండొచ్చు. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇంత మనసు ప్రశాంతంగా మారుతుంది. సాయంత్రం అనారోగ్యానికి గురవుతారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు ఏవైనా అడ్డంకులు ఏర్పడితే నేటితో పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభరాశి ఉద్యోగులకు అదుపు బాధ్యతలు పెరుగుతాయి. నీతో కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే మీకు ఉచ్చు కోసం పోటీ పెరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో ఎవరిని నమ్మొద్దు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి అనుకూల వాతావరణం.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీన రాశి వారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల సహాయంతో అధిక ధనాన్ని పొందుతారు. తల్లిదండ్రులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా వాతావరణ ఉంటుంది.