Today Horoscope In Telugu: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈ కారణంగా ఐదు రాశులకు విశేష ప్రయోజనాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : మీ మధురమైన మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. దీంతో సమాజంలో గుర్తింపు వస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : అందువలన నుంచి తన సహాయం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తను వింటారు. ఇంట్లో శుభకార్యం చేయడానికి సన్నద్ధమవుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఓ విషయంపై తీవ్రంగా చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. పిల్లల కోసం సమయం కేటాయిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎవరికైనా అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రులకు సేవ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు పెద్ద మొత్తంలో లాభాలు పొందే అవకాశం.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూల వాతావరణం. సమస్యలు సృష్టించే వారికి దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : గతం నుంచి పోరాడుతున్న ఓ సమస్యపై విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే మధ్యవర్తిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. కుటుంబంలో డబ్బు ఖర్చు అవుతుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులు లాభాలు పొందుతారు. ప్రయాణాలు చేయాల్సివస్తే ఆలోచించాలి. తప్పనిసరి అయితేనే వాహనాలపై వెళ్ళాలి. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం తథ్యం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రల కోసం ప్లాన్ చేస్తారు. ఇంట్లో వివాహానికి ఏర్పాట్లు చేస్తారు. బయట వ్యక్తులతో విభేదాలు ఉండవచ్చు. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : జీవిత భాగస్వామి కోసం ఖర్చులు చేస్తారు. వ్యాపారులు ఇతరుల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. చట్టపరమైన చిక్కులు ఉంటే రేటుతో పరిష్కారం అవుతాయి. కొత్త ప్రణాళికలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాద ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొన్ని రహస్యాలు ఇతరులకు చెప్పకుండా ఉండడమే మంచిది. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. అయితే ప్రేమతో ఉండడంవల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రహస్యాలు వారికి చెప్పకపోవడమే మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగులకు శత్రువులు ఉండే అవకాశం. సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. పూర్వికులు ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాల్సివస్తే ఇతరుల సలహా తీసుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. మందుల నుంచి శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.