2024 First solar eclipse: సూర్యుడికి, భూమికి మధ్య శుక్రుడు మధ్యలోకి వస్తాడు. ఈ సమయంలో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం మత విశ్వాసాల ఆధారంగా ఆమవాస్య రోజు ఏర్పడుతుంది. సూర్య గ్రహణం సందర్భంగా కొన్ని రాశుల గల జీవితాల్లో మార్పులు రానున్నాయి. దీంతో కొందరు జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయి. 2024 ఏడాదిలో మొదటి సూర్యగ్రహనం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఈ సందర్భంగా రెండు రాశుల్లో ఊహించని ఫలితాలు రానున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి? వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు రానున్నాయి?
2024 సంవత్సరం ఏప్రిల్ 8న సోమవారం తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది ఉదయం 0.12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.25 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో ఆలయాలు మూసివేయనున్నారు. గర్భిణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో అతినీలలోహిత కిరణాలు పడే అవకాశం ఉన్నందున బయట తిరగకుండా ఉండాలని అంటున్నారు. అయితే కొందరు సైన్స్ ను నమ్మేవారు మాత్రం ఇదంతా వట్టిదేనని, బైనాక్యూలర్ తో సూర్య గ్రహాన్ని చూడొచ్చని వాదిస్తున్నారు.
అయితే సూర్య గ్రహణం సందర్భంగా రెండు రాశుల వారికి రాజయోగం పట్టనుంది. వీటిలో తులా రాశి ఒకటి. సూర్య గ్రహణం తరువాత తులారాశి వారి జీవితం మారిపోనుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోయి.. అధిక ఆదాయం వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూల వాతావరణం. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అవకాశాలు. వ్యాపారులు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో నిత్యం సంతోషంగా ఉంటారు.
ఈ సందర్భంగా మకర రాశి వారికి కూడా సూర్యగ్రహణం కలిసి రానుంది. సూర్య గ్రహణం సందర్భంగా వీరికి మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు అవమానాలు ఎదుర్కొన్న వారు ఇఫ్పుడు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. అయితే మానసికంగా మాత్రం సంతోషంగా ఉండలేరు. ఇలాంటి వారు శివుడిని ఆరాధిస్తే ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి గతంలో పెండింగులో ఉన్న పనులన్నీ ఈ సూర్యగ్రహణం తరువాత పూర్తవుతాయి.