Rashi Phalalu: మేషరాశి:
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గాఉంటుంది. గతంలో చేపట్టిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
వృషభం:
వీరికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. శుభ వార్తలు వింటారు. అయితే అనవసర వివాదాలకూ దూరంగా ఉండడం మంచిది.
మిథునం:
ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులు మొదలు పెడుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.
కర్కాటకం:
భాగస్వామి వ్యాపారం చేసేవారు కొన్ని విషయాల్లో వృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలు వచ్చిపడుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
సింహం:
దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటున్నారు. ఈ సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. గతంలో మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.
కన్య:
అనుకోని ప్రయాణాలు ఉంటాయి. వీటితో లాభాలు కలుగుతాయి. కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. క్రయ, విక్రయాలు చేసేవారు కూడా లాభం పొందుతారు.
తుల:
దూర ప్రాంతాల నుంచి విన్నసమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సంతానం యోగం ఉండే అవకాశం. ఉన్నత విద్యావంతులకు అనుకూలమైన రోజు.
వృశ్చికం:
వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభం పొందుతారు. కుటుంబ సభ్యలతో కలిసి పోతారు. మ్యూజిక్ ను ఎక్కువగా వింటారు.
ధనస్సు:
సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం:
వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. మొదలు పెట్టిన పనులు పూర్తి చేయడానికి కష్టపడుతారు. కానీ చివరికి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం.
కుంభం:
బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు, నూతన పరిచయాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరమైన చిక్కులు తొలిగిపోతాయి.
మీనం:
దీర్ఘ కాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడుతారు.