Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై బుధవారం స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు కుంభ రాశిలో సూర్యుడు శని కలిసి ప్రయాణం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. మరి కొన్ని రాశుల వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కొందరు శత్రువులు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంటారు. ఆహార నాణ్యత పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు చుట్టుపక్కల వారే ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : విద్యార్థుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు చేయడం వలన తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. పెండింగ్ బకాయిలు వసూలు చేసేందుకు కృషి చేస్తారు. కొన్ని కారణాల వల్ల కొత్త వ్యక్తులతో ఇబ్బందులు ఏర్పడతాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం ఇతరులకు సాయం చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : పూర్వీకుల ఆస్తి గురించి శుభవార్తలు వింటారు. కొన్ని రంగాల వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారి ఆశలు నెరవేర్చేందుకు ప్రత్యేకంగా పెట్టుబడులు పెడతారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. బకాయిలు వసూలు అవుతాయి. కొన్ని ప్రదేశాల నుంచి వచ్చే డబ్బు ఆగిపోతుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు. అయితే కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటే మాటలను అదుపులోకి ఉంచుకోవాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తోటి వారితో స్నేహపూర్వకంగా మెదలాలి. వారితో వాగ్వాదం ఎంతవరకు మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి కోసం తీవ్రంగా కష్టపడతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. స్థిరాస్తిని కొనుగోలు చేయాల్సివస్తే ఇదే అనుకూల సమయం. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. అయితే వీరికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అయినా ముందుకు వెళ్లి పనులు చేయగలగాలి. వ్యాపారులకు భాగస్వాములతో కొత్త చర్చలు ఉంటాయి. మీ భవిష్యత్తును లాభాలు తీసుకొస్తాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. నీతో మానసికంగా ఆందోళనలతో ఉంటారు. వ్యాపారులు కొత్త వ్యక్తులను కలుసుకొని కొత్త ప్రాజెక్టులపై చర్చిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రియమైన వారికోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి అండతో కొత్త ప్రాజెక్టును పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. పెండింగ్ పలను పూర్తి చేయడంతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : రాజకీయాల్లో ఉండే వారికి ఈరోజు అనుకూల సమయం. అయితే కొందరు శత్రువుల అడ్డంకులు సృష్టిస్తారు. అయినా వెనుకాడ ఉంటా ముందుకు వెళ్లాలి. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు పదోన్నతులు పొందే అవకాశం. అయితే లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. తోటి వారితో ఉద్యోగులు సంయమను పాటించాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఏదైనా పనులు ప్రారంభిస్తే అడ్డంకులు ఏర్పడతాయి. అయితే పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండాలి. దుబారా ఖర్చులు పెరుగుతాయి. వీటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులకు తక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టుపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కోర్టుపరమైన చిక్కులు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. పూర్వికుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతి పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆమోదంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. పాద సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు సులువుగా లాభాలు పొందుతారు. బ్యాంకు రుణం తీసుకోవాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఒకరి కోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. కొన్ని పనుల కారణంగా బిజీగా మారుతారు.