Today Horoscope In Telugu (1)
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి మహర్దశ పట్టణం ఉంది. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వింటారు. వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఓ సమాచారాన్ని ఆందోళన కలిగిస్తుంది. శత్రువుల విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో మద్దతు ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. వైద్య సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విరాళాశాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయం తక్కువగా ఉండడంతో ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు వ్యాపారులు బిజీగా గడుపుతారు. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి తోటి వారి సహాయం ఉంటుంది. దీంతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఒప్పందాలు చేసుకునే సమయం అనుకూలం కాదు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువుల్లో ఒకరి నుంచి నిరాశ వార్తలను ఎదుర్కొంటారు. పెద్దల సలహా మేరకు కొత్త పెట్టుబడులు పెడతారు. ప్రణాళిక ప్రకారం గా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభకర కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులు ఈరోజు చురుగ్గా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతారు. కొన్ని కారణాలవల్ల ముఖ్యమైన పనులు ఆగిపోవచ్చు. దూర ప్రయాణాలు చేసేవారు ఆలోచించాలి. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లేందుకు మార్గం ఏర్పడుతుంది. పెద్దల సలహా మేరకు వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అయితే కొందరి చర్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి తెలివితేటలను ప్రదర్శిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కానీ కొందరు సహకారం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వ్యాపారాలు ఈరోజు కొన్ని మార్పులు చేసుకుంటారు.. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఏదైనా వివాదం తలెత్తుతే దానిని వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. లేకుంటే సంబంధాలు దెబ్బతింటాయి. ఇతరుల వద్ద నుంచి డబ్బు అప్పుగా తీసుకునే అవకాశం వస్తే ఆలోచించాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దీంతో వ్యాపారులకు అనుకూలంగా మారుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపిస్తుంది. అయితే మాటల మాధుర్యంతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని నిరాశ వార్తలు వింటారు. బంధువుల్లో ఒకరి నుంచి డబ్బు సహాయం అందుతుంది. కానీ దీనిని చెల్లించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్త కోర్సులో ప్రవేశించడానికి అనువైన సమయం ఇదే.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మనసులోకి ప్రతికూల ఆలోచనలు రాకుండా చూడాలి. స్నేహితుల ఒకరి నుంచి డబ్బు సహాయం అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అప్పుల నుంచి బయటపడేందుకు అనేక మార్గాలు వెతుక్కుంటారు. కొందరు డబ్బు సహాయం చేసేందుకు వచ్చినా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరపొద్దు. స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తను వింటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు మార్గాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టు చేతికి రావడం వల్ల వ్యాపారాలు ఉత్సాహంగా పనిచేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.