Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై మంగళవారం పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శని బుధుడు కలయిక ఉండనుంది. దీంతోకొన్ని రాశుల వారికి అపారమైన లాభాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారు వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడును పెడతారు. కొన్ని సమస్యల కారణంగా మానసికంగా ఆందోళన ఉంటుంది. మార్కెట్లో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అయితే వ్యాపారులు వీధితో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేయాల్సి వచ్చినా కష్టపడాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) రోజువారి కార్యకలాపాల కోసం ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అయితే పరీక్షల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి తన సహాయం పొందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఓ సమస్యతో మానసికంగా ఆందోళన చెందుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ గురించి వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారంలో కొన్ని పనులు కష్టపడకుండానే పూర్తవుతాయి. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : డబ్బు సంపాదించడానికి మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారులకు పెద్ద మొత్తంలో లాభాలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు చర్యలు వద్దు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులు ఊహించని విజయాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో మానసికంగా సంతోషంగా ఉంటారు. విద్యార్థుల సైతం పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొందరు వ్యక్తులు ఈ రాశి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అందువల్ల చాకచక్యంగా వ్యవహరించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కొత్త ప్రణాళికలను ఏర్పరచుకుంటారు. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు సీనియర్లనుంచి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. కోపాన్ని నియంత్రించుకోకపోతే కష్టాలే ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వ్యాపారులకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. ఉన్నత విద్య చేయాలనుకునే విద్యార్థులకు మార్గం సులభం అవుతుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఉద్యోగాన్ని సాధిస్తారు. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : సీనియర్ల మద్దతుతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఎవరితోనైనా వాగ్వాదం ఉంటే వారికి దూరంగా ఉండాలి. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని మాటలు కారణంగా సంబంధాలు చీలికలు ఏర్పడతాయి. అందువల్ల కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఉద్యోగులకు లక్ష్యాలు ఏర్పడతాయి. అయితే వీటిని పూర్తి చేయడంలో తీవ్రంగా కష్టపడతారు. కొందరి వ్యక్తుల కారణంగా వ్యాపారం లోకి అడుగు పెడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులను అంత ఈజీగా నమ్మకపోవడమే మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : పాదాలకు దూరంగా ఉండాలి. శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనసులో ఉండే ప్రతికూల ఆలోచనలు తుంచి వేయాలి.. పూర్వికులు ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి షికారులకు వెళ్తారు. పాత స్నేహితుల్లో కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. అయితే వ్యాపారులు భాగస్వాముల్లో కొందరిని నమ్మొద్దు. కొత్తగా పెట్టుబడి ఇల్లు పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.