KGF2 Movie Toofan Song Lyrics Telugu and English: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్నారు. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచుతూ తాజాగా సినిమాలోని తొలి పాటను రిలీజ్ చేసింది. ‘తూఫాన్ తూఫాన్.. ఎలుగెత్తి ఎగిసి పడగొట్టినదే..’ అంటూ సాగిన ఈ పాట చాలా బాగుంది.

KGF2 Movie Toofan Song Details
భయంతో నలిగిపోయిన తమలో.. సడెన్ గా వచ్చి ధైర్యాన్ని నింపిన రాఖీ భాయ్‌ని పొగుడుతూ గోల్డ్ మైన్‌లోని కార్మికులు పాడిన పాట ఇది. ఈ పాటలోని లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. బంగారు సామ్రాజ్యానికి అధినేతగా మారిన తర్వాత రాఖీ భాయ్ ప్రజలతో ఎలా కలిసిపోయాడన్న అంశాలను కూడా ఈ పాటలో చాలా బాగా చూపించారు. అలాగే, పాటలోని లిరిక్స్ తో పాటు మ్యూజిక్ బిట్స్ కూడా బాగున్నాయి.

అందుకే.. ఈ సాంగ్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఏది ఏమైనా దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది. అందుకే కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటున్నారు.
కాగా కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. యష్ ని ఎదుర్కొనే విలన్ గా ఈ బాలీవుడ్ నటుడు ఎలా ఉంటాడో చూడాలి. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా కీలక రోల్స్ చేస్తున్నారు. అందుకే మొదటి భాగానికి మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉన్నాయి.
ఇక ఫస్ట్ పార్ట్ లో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించిన తమన్నా.. సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా కనిపించబోతుందట. మొత్తానికి ఈ సినిమా దాదాపు రెండేళ్లు నుండి వాయిదా పడుతూనే వస్తోంది. చివరకు ఏప్రిల్ 14న ఈ సినిమా రాబోతుంది.
Toofan Song Lyrics Telugu
సమందర్ మే లెహర్ ఉతి హై
జిద్ది జిద్ధి హై తూఫాన్
ఛట్టానే బి కాంప్ రహీ హై
జిద్ది జిద్ధి హై తూఫాన్
జిద్ధి హై తూఫాన్…!!!
తూ క్యా మై క్యా
హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినడే
తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినడే
తూఫాన్, తూఫాన్
సర్రంటు వీడు అడుగేసి
ఉద్యమిస్తే ఆక్రమణమే
గర్రంటు గదిమి గర్జిస్తే
జలదరించు భూగమనమే
ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ
ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ
హే, చుర్రంటు చురుకు
ముట్టించు అర్క తేజమాగమనమే
ఎర్రంచు కరకు ఖడ్గాల
శత్రు దమనమాగమనమే
రాక్ రాక్ రాకీ
రాక్ రాక్ రాకీ రాకీ
రాక్ రాక్ రాకీ
రాక్ రాక్ రాకీ
నీ నీడలో మరుజన్మగా
ధైర్యానికే జననం
బిగితప్పిన పిడికిళ్లకు
నేర్పించరా జగడం
స్వర్ణం మలినం… వీడే ఆ రెండు
యముడై ప్రియతముడై
చలరేగే మొనగాడు
వైరి జనుల ముచ్చమట ముంచుట
వీడు నేర్చిన మొదటి ముచ్చట
విజృంభించు ఆ సత్తువ ముందు
తూ క్యా మై క్యా
హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినడే
తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినడే
తూఫాన్, తూఫాన్