Sita Ramam 18 Day Collections: ‘దుల్కర్ సల్మాన్’ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాకు 18వ రోజు కూడా చెప్పుకోతగ్గ కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. ఈ సినిమాతో ‘దుల్కర్ సల్మాన్’కి తెలుగులో మళ్ళీ మరో భారీ హిట్ పడింది. అసలు ‘సీతా రామం’ సినిమాకు మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో యుద్ధంతో రాసిన ఈ ప్రేమకథ పరిస్థితి బాగుంది. అసలు ఇంతకీ, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ? చూద్దాం రండి.
ముందుగా ‘సీతా రామం’ 18th డే కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 4.61 కోట్లు
సీడెడ్ 3.44 కోట్లు
ఉత్తరాంధ్ర 1.79 కోట్లు
ఈస్ట్ 1.71 కోట్లు
వెస్ట్ 1.67 కోట్లు
గుంటూరు 2.29 కోట్లు
కృష్ణా 1.41 కోట్లు
నెల్లూరు 1.25 కోట్లు
ఏపీ + తెలంగాణలో ‘సీతా రామం’ 18వ రోజు కూడా 35 లక్షలు రాబట్టింది. మొత్తం 18th డే కలెక్షన్స్ గానూ రూ. 18.31 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 36.62 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.89 కోట్లు
ఓవర్సీస్ 1.11 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా ‘సీతా రామం’ 18వ రోజు 40 లక్షలు రాబట్టింది. మొత్తం 18th డే కలెక్షన్స్ గానూ 20.38 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 40.76 కోట్లను కొల్లగొట్టింది
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రం ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. పైగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాగూర్ లతో పాటు రష్మిక మందన్న కూడా నటించింది. అలాగే హీరో సుమంత్, భూమిక కూడా నటించారు. వీరంతా ఈ సినిమా ప్లస్ అయ్యారు. అసలు ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీలను పెద్దగా చూడటం లేదు. కానీ.. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరించడం విశేషమే.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Sita ramam 18 day collections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com