Shruti Haasan: ‘శృతి హాసన్’ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఎంత బోల్డ్ అంటే.. పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ కి ముద్దులు ఇస్తూ ఫోజులు ఇచ్చేంత బోల్డ్. పైగా శృతి హాసన్ పైత్యానికి అడ్డు అదుపు అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా ఉంటుందో ? ఎవరి గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తోందో ? ఆమెకు తెలియదు. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా శృతి హాసన్ వ్యవహారం మరీ మితిమీరిపోతుందని ఇండస్ట్రీలో కూడా బాగా టాక్ వినిపిస్తోంది.
అయితే, ‘శృతి హాసన్’ తాజాగా తన ఇష్టాల గురించి, డిప్రెషన్ గురించి, అలాగే తన బ్రేకప్స్ గురించి కూడా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. పనిలో పనిగా తాను చేయించుకున్న ట్రీట్ మెంట్స్.. అంటే సర్జరీల గురించి లేండి.. ఇలా ఏదీ దాచుకోకుండా మొత్తానికి అన్నీ ఓపెన్ గా చెప్పేసింది. అయినా ఇలా ప్రతిది ఎలా షేర్ చేసుకుంటావ్ ? అంటూ ఆమె పై నెటిజన్లు ట్రోల్ కూడా చేశారు. ఇలాంటి విషయాల్లో తనను ట్రోలింగ్ చేయడం ఏమిటి అంటూ శృతి హాసన్ తనదైన శైలిలో వాళ్ళ పై సీరియస్ అయింది అనుకోండి.
Also Read: నెటిజన్ పై పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సీరియస్ !
మొత్తమ్మీద శృతి హాసన్ సోషల్ మీడియాలో ఇచ్చిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటీ అంటే.. మీ ఇద్దరిలో (ఒకరు శృతి, మరొకరు ఆమె ప్రియడు శాంతను) ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ? అని ఒక క్వశ్చన్ అడిగారు. వెంటనే ‘శృతి హాసన్’ రియాక్ట్ అవుతూ.. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. నాకు వాడు బాగా నచ్చాడు. అందుకే నేనే ముందు ముద్దు పెట్టి.. ప్రపోజ్ చేశాను’ అంటూ ఓపెన్ గా చెప్పి సర్ ప్రైజ్ చేసింది శృతి హాసన్.
ఇక ఈ మధ్య శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్మార్కెట్లో ప్రత్యక్షమైంది. అక్కడ శాంతనుకు హగ్గులిస్తూ, పబ్లిక్ గా ముద్దులు పెట్టింది. శృతి హాసన్ చేసిన ఈ బాగోతాలను అక్కడి జనాలు తమ ఫోన్ కెమెరాల్లో బంధించి నెట్టింట అప్ లోడ్ చేశారు. శృతి హాసన్ ముద్దులు హాగ్ లకు సంబంధించిన ఆ ఫొటోలు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి కూడా.
ఈ విషయంలో మరొక హీరోయిన్ అయితే అవి చూసి సిగ్గుతో చితికిపోతుంది. కానీ శృతి హాసన్ ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసి.. బోల్డ్ యువత పట్ల తన విశాల హృదయాన్ని ఘనంగా చాటుకుంది.
Also Read: హీరో శింబుకు అరుదైన పురస్కారం.. ఫ్యాన్స్ ఖుషీ..!
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Shruti haasan reveals she proposed to boyfriend santanu hazarika
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com