Bandi sanjay- Aravind: మనకు బీజేపీ అనగానే మొన్నటిదాకా ఓ ఇద్దరు నేతలు ముఖ్యంగా కనిపించేవారు. ఏ ప్రెస్ మీట్ అయినా ప్రతిపక్షాలను ఓరేంజ్ లో తిట్టేసి యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్నది ఆ ఇద్దరు నేతలే. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోసం ఆ ఇద్దరూ గట్టిగా పోటీ పడ్డారు. ఇంతకీ వారెవరో కాదండోయ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇద్దరూ 2019 ఎంపీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా సంచలన విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపారు.
పైగా ఇద్దరూ గెలిచింది కూడా టీఆర్ఎస్ లో కీలకమైన నేతల మీద. నిజామాబాద్ లో కేసీఆర్ కూతురు కవిత మీద అరవింద్ గెలవగా.. అటు కరీంనగర్ లో కేసీఆర్ కు కుడిభుజం లాంటి వినోద్ కుమార్ మీద సంజయ్ విజయం సాధించారు. అప్పటి వరకు ఎలాంటి అంచనాలు లేని వీరు బీజేపీ హిందూత్వ ఎజెండా, మోడీ వేవ్ తో పాటు.. తమ ప్రయత్నాలతో గెలిచారు. వీరిద్దరి గెలుపుకు అనేక కారణాలు ఉన్నాయి.
Also Read: Prabhas: RRR మూవీ చూసి ఘోరంగా ఏడ్చేసాను
అయితే వాటిని పక్కనపెడితే గెలిచిన తర్వాత వీరిద్దరూ ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. పార్టీలో పట్టు బిగించి కీలక నేతలుగా ఎదిగారు. వీరిద్దరి అంతిమ లక్ష్యం ఎమ్మెల్యేలుగా గెలవడం. తమకంటూ సొంతంగా ఓ నియోజకవర్గాన్ని ఏర్పరచుకోవడం. ఎంపీగా గెలిస్తే ఓ ప్రాంతం అంటూ చెప్పుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆ ఎంపీ నియోజకవర్గంలో చాలా మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉంటారు.
అదే ఎమ్మెల్యే అయితే తమకంటూ ఓ అడ్డా లాగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇటు బండి సంజయ్ కరీంనగర్ లో గెలిచి తన సత్తా చూపించాలి అనుకుంటున్నారు. ఇప్పటికి రెండుసార్లు గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయి పరాభవ పాలయ్యారు. అయితే మొదటి సారి కంటే 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. కొద్దిపాటి తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచే వారే. కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.
కానీ ఆయన ప్రత్యర్థి గంగుల కమలాకర్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన బలం మరింతగా పెరిగిందని చెప్పుకోవాలి. నియోజకవర్గంలో మంత్రిగా తిరుగుతూ అభివృద్ధి పనులు చేయిస్తూ తన పట్టును మరింత పెంచుకుంటున్నారు. బండి సంజయ్ తనకు భవిష్యత్తులో పోటీ వస్తారని ముందే గ్రహించిన గంగుల.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఇతర పార్టీల్లోని కార్యకర్తలను తనవైపు లాగేసుకుంటున్నారు.
బండి సంజయ్ కూడా గంగుల కమలాకర్ కు చెక్ పెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగా బండి సంజయ్ కంటే గంగుల పై స్థానంలో ఉన్నారు. కానీ సొంతంగా యూత్ లో ఆయనకు పెద్దగా పట్టలేదు. బండి సంజయ్ కు మాత్రం ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశం. పైగా రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తిగా కొంత సానుభూతి కూడా ఉంది. కానీ గెలవడానికి ఇవి సరిపోవు. ఎంపీగా ఉండి నియోజకవర్గానికి ఏం చేశావ్ అంటే చెప్పడానికి ఆయన దగ్గర పెద్దగా సమాధానాలు కూడా లేవు.
ప్రత్యేక నిధులు తెచ్చి కరీంనగర్ నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఇవన్నీ పక్కనపెట్టి కేవలం హిందూత్వ ఎజెండాను వాడుకుంటే ఆయన గెలుస్తారని చెప్పలేము. గెలవడానికి కావాల్సింది మాయ మాటలు కాదు. పనిచేస్తానని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఇక ఈయనతోపాటు ధర్మపురి అరవింద్ పరిస్థితి కూడా ఇదే. ఆయన రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆయన ఇప్పటికే రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. పైగా మరోసారి గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. దానికోసమే ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికే ధర్మపురి అరవింద్ ఆర్మూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆయన అలర్ట్ అయిపోయారు. ఎక్కడ అరవింద్ తనకు పోటీ వస్తారో అని నిత్యం నియోజకవర్గంలోనే మకాం వేస్తున్నారు.
పైగా ధర్మపురి అరవింద్ ను అటు రాజకీయంగా ఇది వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తనకు పోటీ రాకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ ఇవ్వలేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్ తప్ప మరో నేత కనిపించట్లేదు. అరవింద్ ను ఓడించాలని కేసీఆర్ కూడా బలంగా నిర్ణయించుకుంటున్నారు. అటు కల్వకుంట్ల కవిత కూడా జీవన్ రెడ్డి ఫుల్ సపోర్ట్ చేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ ఆర్మూర్ లో పోటీ చేస్తే ఆయన ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని కవిత బలంగా ఫిక్స్ అయ్యారు. ఆమె సపోర్టుతోనే జీవన్ రెడ్డి చెలరేగిపోతున్నారు. ప్రతి సంఘటనలో అరవిందులు లాగుతూ ప్రతీకార చర్యలకు సైతం దిగుతున్నారు. అరవింద్ ఎక్కడికి వెళ్ళినా సరే టీఆర్ఎస్ నేతలతో నిరసనలు చేయిస్తున్నారు. ఇక మొన్న రైతులతో తమ వడ్లను తీసుకెళ్ళి అరవింద్ ఇంటి ముందు పోయిన ధర్నా చేయించారు.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పసుపు బోర్డు తీసుకు వస్తానని చెప్పి ఎంపీగా గెలిచిన అరవింద్.. ఫేక్ అగ్రిమెంట్ రాసిచ్చాడని.. పసుపు బోర్డు గురించి అడిగితే బోర్డు తేకుండా అధిక ధర ఇస్తున్నామంటూ కహానీలు చెబుతున్నాడంటూ రైతులకు ఈ విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు జీవన్ రెడ్డి. ఈ విషయంలో ఆయన కొంత సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. పైగా ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్న ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. ఇది అరవింద్ కు కొంత ఇబ్బంది కలిగించే విషయమే.
ఇటు సంజయ్ లాగే అరవింద్ కూడా.. ఎంతసేపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు తప్ప అభివృద్ధి పనులు చేసింది గానీ.. కేంద్రం నుంచి ఏమైనా ప్రత్యేక నిధులు.. లేదంటే ప్రత్యేకమైన పరిశ్రమలు, ఇతర విద్యాపరమైన సంస్థలు తెచ్చింది శూన్యం. ఆయన ఎంపీ అయినప్పటినుంచి ఏ వర్గంలోని ప్రత్యేక పట్టును సాధించలేకపోయారు. పైగా ఈసారి టీఆర్ఎస్ కు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. ఆయన వ్యూహాలు ఎదుర్కొని ఈ ఇద్దరు కీలక నేతలు ఎమ్మెల్యేగా గెలవడం అంటే కత్తి మీద సాము లాంటిదే.
మహామహులను మట్టికరిపించిన చరిత్ర ఆయనకు ఉంది. ఆయన ఇప్పటికే ఈ ఇద్దరు మీద కూడా ప్రత్యేకమైన వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతలు ఎవరి మీద అయితే పోటీ చేస్తారో.. వారికి ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకమైన సూచనలు సలహాలు ఇస్తున్నారట. ఆ విధంగా కనుక పార్టీని వారు ముందుకు తీసుకెళ్లినట్లు అయితే సంజయ్, అరవింద్ ఆశలు అడియాశలు కావడం ఖాయం.
CM Jagan: కుల సమీకరణాల ఆధారంగానే పార్టీ బాధ్యతలు.. ఇదేం తీరు జగన్..?
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Sanjay and arvind hope for mla seat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com