Godari Gattu : మన చిన్నతనం లో తన అద్భుతమైన గాత్రంతో అశేష ప్రేక్షాభిమానం పొందిన గాయకులతో ఒకరు రమణ గోగుల. అప్పట్లో ఎక్కువగా ఈయన పవన్ కళ్యాణ్ సినిమాలకు పాటలు పాడేవాడు. ఈయన పాట పాడితే అచ్చు గుద్దినట్టు పవన్ కళ్యాణ్ పాడినట్టే ఉండేది. ఫ్యాన్స్, ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ తన పాటలను తానే పడుకునేవాడు అని అప్పట్లో అనుకునేవారు. ఆ రేంజ్ లో ఆయన పాడేవాడు. కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు, మహేష్ బాబు, వెంకటేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించి, పాటలు కూడా పాడాడు. ఆ సాంగ్స్ అన్ని అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా ఆ పాటలు వింటే మన చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపిస్తుంది. ఆ రేంజ్ క్వాలిటీ మ్యూజిక్ అందించాడు ఆయన. అయితే మధ్యలో ఎందుకో ఆయన సినీ ఇండస్ట్రీ కి పూర్తిగా దూరమయ్యాడు.
అయితే ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, రీసెంట్ గా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలోని ఒక పాట ఎట్టి పరిస్థితిలోనూ రమణ గోగులతో పాడించాలని పట్టుబట్టి, ఎక్కడో అమెరికా లో ఉద్యోగం చేసుకుంటున్నఆయన్ని పిలిపించి ‘గోదారి గట్టు మీద’ అనే పాటని పాడించాడు. ఈ సాంగ్ ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ సాంగ్ అయిన మొదటిసారి విన్నప్పుడు ఆడియన్స్ కి నచ్చడం కష్టమే. కానీ ఈ పాట మొదటిసారి విన్నప్పుడే ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎక్కేసింది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ పాటకు యూట్యూబ్ లో 28 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అనేది. ఇంస్టాగ్రామ్ లో నెటిజెన్స్ ఎక్కడ చూసినా ఈ పాటకి రీల్స్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పాట ఆడియన్స్ లోకి వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది. థియేటర్స్ లో ఈ పాట వచ్చినప్పుడు ఆడియన్స్ సీట్ల మీద కూర్చోరు. అయితే ఈ పాట కోసం రమణ గోగుల తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెంకటేష్ మీద ఉన్న అభిమానం తో ఆయన ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. నిర్మాత దిల్ రాజు కి కేవలం ఆయన్ని అమెరికా నుండి రప్పించడానికి టికెట్ ఖర్చులు, హోటల్ లో ఉండడానికి అయ్యే ఖర్చులు తప్ప, రమణ గోగుల ఒక్క పైసా కూడా తీసుకోలేదు. కానీ ఆయన మళ్ళీ ఆయన రీ ఎంట్రీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, తమ సినిమా కోసం ఒక్క పాట పాడాలని సోషల్ మీడియా లో రమణ గోగుల ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి రమణ గోగుల పాడుతాడా లేదా అనేది చూడాలి.