
కాలం మారుతున్నా మనుషులు మారడం లేదు. మహిళలు ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్నా కొందరు వారిపై వివక్షను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాకు చెందిన పన్నాలాల్ అనే వ్యక్తి మగబిడ్డ కోసం భార్య కడుపు కోసి తెలుసుకోవాలనుకున్నాడు. ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలకు తండ్రి అయిన అతను మగబిడ్డ కోసం భార్యను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ తరుణంలో దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం బంధువులకు తెలవడంతో గర్భిణీ అయిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
Comments are closed.