ఏప్రిల్‌ 15 నుంచి మూడు జోన్లు?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉంది.నమోదైన కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. రెడ్ జోన్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ఆరెంజ్, గ్రీన్ జోనుల్లో పారదర్శిక లాక్ డౌన్ ని అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్‌ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్‌-19ను దీటుగా […]

Written By: Neelambaram, Updated On : April 13, 2020 12:59 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉంది.నమోదైన కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. రెడ్ జోన్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ఆరెంజ్, గ్రీన్ జోనుల్లో పారదర్శిక లాక్ డౌన్ ని అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్‌ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్‌-19ను దీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

రెడ్ జోన్లుగా ప్రకటిచింన ప్రాంతాలలో ఏప్రిల్‌ 14 తరవాత కూడా పూర్తి స్థాయిలో లాక్‌ డౌన్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. అన్ని రకాల కార్యకలాపాలపైనా నిషేధం ఉంటుంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాల్సి ఉంటుంది.ఆరెంజ్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి కొన్ని సర్వీసులు నడపడం, వ్యవసాయ పనులకు అనుమతులు ఉంటాయి.

లాక్ ‌డౌన్‌ అమలులో ఉంటే ఆంక్షల నుంచి ఏయే రంగాలను మినహాయించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ ఒక జాబితా రూపొందిస్తోంది. వ్యక్తిగత దూరాన్ని కచ్చితంగా పాటించే నిబంధనతో వ్యవసాయం, చిన్న-మధ్య తరహా, మౌలిక వసతుల రంగాలకు సంబంధించి కొన్ని ఆంక్షలను మినహాయించే అవకాశం ఉందని సమాచారం. విమానయాన రంగానికి కూడా మినహాయింపు లభించవచ్చని తెలుస్తోంది.