Nandamuri Balakrishna: బాలయ్యకి విలన్ వచ్చాడు, డేట్లు ఫిక్స్ అయ్యాయి !

Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సినిమాలో విలన్ ను ఫిక్స్ చేశారు. కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ బాలయ్యకి విలన్ గా నటించబోతున్నాడని చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది. కన్నడంలో దునియా సినిమాతో బాగా పాపులరయ్యాడు దునియా విజయ్. అందుకే, గోపీచంద్ మలినేని దునియా విజయ్ ను విలన్ గా ఫైనల్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ డేట్స్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 06 […]

Written By: Shiva, Updated On : January 3, 2022 11:57 am

Nandamuri Balakrishna

Follow us on

Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సినిమాలో విలన్ ను ఫిక్స్ చేశారు. కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ బాలయ్యకి విలన్ గా నటించబోతున్నాడని చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది. కన్నడంలో దునియా సినిమాతో బాగా పాపులరయ్యాడు దునియా విజయ్. అందుకే, గోపీచంద్ మలినేని దునియా విజయ్ ను విలన్ గా ఫైనల్ చేశాడు.

Nandamuri Balakrishna

ఇక ఈ సినిమా షూటింగ్ డేట్స్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 06 నుంచి ఫస్ట్ షెడ్యూల్ ను స్టార్ చేయనున్నారు. ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ లో బాగానే కసరత్తులు చేశాడు. ముఖ్యంగా బాలయ్య గెటప్ పై బాగా వర్క్ చేస్తున్నాడు. అయితే, ఇప్పటికే బాలయ్య లుక్ బయటకు వచ్చింది. కానీ అది బాలయ్య లుక్ కాదు అని.. ఈ సినిమాలో బాలయ్య లుక్ చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ రాణిస్తున్న స్టార్ హీరోస్ వీళ్లే..

అన్నట్టు ఈ సినిమా కథ ఇది అంటూ ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపించింది. ఈ కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని గతంలో బాగా వినిపించింది. అలాగే బాలయ్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు అని కూడా అన్నారు.

ఈ అంశం పై ఈ సినిమా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలో రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తామని, బాలయ్య లుక్స్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయని సాయి మాధవ్ చెప్పారు. ఇక క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారధ్యంలో ఈ సినిమా రానుంది. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోంది.

Also Read: థియేటర్లపై ఓటీటీ ప్రభావం ఎంత..? ఏదీ బెటర్..? ప్రేక్షకులు దేనిని కోరుకుంటున్నారు..?

Tags