తెలంగాణలో కూడా శ్రమదోపిడికి రంగం సిద్ధం?

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాసి, కార్పొరేట్‌ సంస్థలకు వత్తాసు పలికిన ఈ ప్రభుత్వాలు, కార్మికులకు ఆరోగ్యం, రక్షణ, కనీస అవసరాలను తీర్చే చట్టాలను తుంగలో తొక్కి, బడా బాబులకు, వ్యాపార యజమానులకు బ్యాంక్ బాలన్స్ పెంచే పనిలో పడ్డాయి. తాజాగా తెలంగాణలో కూడా కార్మిక చట్టాలను సవరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. పారిశ్రామిక సంఘాల వారు ఈ విషయమై ప్రభుత్వానికి వినతులు పంపుతున్నారు. కార్మిక […]

Written By: Neelambaram, Updated On : May 19, 2020 11:37 am
Follow us on

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాసి, కార్పొరేట్‌ సంస్థలకు వత్తాసు పలికిన ఈ ప్రభుత్వాలు, కార్మికులకు ఆరోగ్యం, రక్షణ, కనీస అవసరాలను తీర్చే చట్టాలను తుంగలో తొక్కి, బడా బాబులకు, వ్యాపార యజమానులకు బ్యాంక్ బాలన్స్ పెంచే పనిలో పడ్డాయి. తాజాగా తెలంగాణలో కూడా కార్మిక చట్టాలను సవరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. పారిశ్రామిక సంఘాల వారు ఈ విషయమై ప్రభుత్వానికి వినతులు పంపుతున్నారు. కార్మిక చట్టంలోని పలు నిబందనలను సడలించడం, ఎనిమిది గంటల షిప్ట్ బదులు పన్నెండు గంటల షిప్టులు పెట్టడం తదితర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలవారు కోరుతున్నారు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల తరహాలో తెలంగాణలో కూడా కార్మిక చట్టాలను కాలరాయలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. ఈ మూడు నెలల కాలంలో ఉత్పత్తి లేక చాలా నష్టపోయామని, ఎనిమిది గంటల షిప్టుకే పరిమితం అయితే తాము అదనంగా పనిచేయిస్తే అదనపు వేతనాలు ఇవ్వవలసి ఉంటుందని, దానిని భరించలేమని అంటున్నారు.

ఈ కార్మిక చట్టాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి మొత్తం 38 కార్మిక చట్టాలకు 35 చట్టాలను రద్దు చేయడం ఆయన అవివేక ఆలోచనలకు నిదర్శనమని ఎకనామిక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా శివరాజ్ సింగ్ ప్రభుత్వం కూడా ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్మికులతో పని చేయించుకోవచ్చనే కొత్త చట్టం చేయడం శ్రమదోపిడి తత్వానికి పరాకాష్ట. గతంలో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు కూడా కార్మికుల పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఒకవేళ తెలంగాణలో కూడా ఈ తరహా శ్రమదోపిడికి తెగబడినట్లయితే నియంత పాలన కేంద్రంలోనే కాదు తెలంగాణలో కూడా కేసీఆర్ మొదలపెట్టినట్లే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.