రాష్ట్ర ప్రజలకు మూడు అవకాశాలు…!!!

దేశ వ్యాప్తంగా కారోన రక్కసి సృష్టిస్తోన్న భయానక పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను ఎవరైనా భేఖాతారు చేస్తే.. అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు అన్ని ఆదేశాలను, అవకాశాలను ఇచ్చింది. ప్రజలందరూ అత్యవసర, నిత్యావసరాల కోసం కుటుంబానికి ఒక్కరు తప్ప అనవసరంగా బయటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేసింది. అలాగే విదేశాల నుండి కొత్తగా గ్రామాలకి వచ్చిన వారికి మరియు గ్రామములో ఎవరికైనా కారోన వైరస్ […]

Written By: Neelambaram, Updated On : March 23, 2020 7:01 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కారోన రక్కసి సృష్టిస్తోన్న భయానక పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను ఎవరైనా భేఖాతారు చేస్తే.. అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు అన్ని ఆదేశాలను, అవకాశాలను ఇచ్చింది.

ప్రజలందరూ అత్యవసర, నిత్యావసరాల కోసం కుటుంబానికి ఒక్కరు తప్ప అనవసరంగా బయటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేసింది. అలాగే విదేశాల నుండి కొత్తగా గ్రామాలకి వచ్చిన వారికి మరియు గ్రామములో ఎవరికైనా కారోన వైరస్ లక్షణాలు ఉంటే గ్రామ సర్పంచికి,లేదా గ్రామ కార్యదర్శికి తప్పకుండా తెలియజేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు 3 అవకాశాలను ఇచ్చింది.

ఏ)ఇంట్లో ఉండాలి (ఇది పాటించపోతే)
బి)హాస్పిటల్ ఉంటారు (ఇదే జరిగితే ఫొటోలో ఉంటారు)
సి)రూ.1000 జరిమానా కట్టి, ఆరు నెలలు జైలులో ఉంటారు.