https://oktelugu.com/

సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?

లాక్‌ డౌన్‌ కారణంగా గత 45 రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. దీంతో వాహనదారులు పేటీఎం, ఫోన్‌ పే, మీ సేవల ద్వారా జరిమానాలు చెల్లించి వారి వాహనాలను తీసుకెళ్తున్నారు. అయితే ఈ జరిమానాల ద్వారా వచ్చిన సొమ్ము రూ.10కోట్లు పై మాటే. లాక్ డౌన్ కాలంలో ఇప్పటి వరకు దాదాపుగా 1.60 లక్షల వాహనాలను హైదరాబాద్ పోలీసులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2020 5:13 pm
    Follow us on

    లాక్‌ డౌన్‌ కారణంగా గత 45 రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. దీంతో వాహనదారులు పేటీఎం, ఫోన్‌ పే, మీ సేవల ద్వారా జరిమానాలు చెల్లించి వారి వాహనాలను తీసుకెళ్తున్నారు. అయితే ఈ జరిమానాల ద్వారా వచ్చిన సొమ్ము రూ.10కోట్లు పై మాటే.

    లాక్ డౌన్ కాలంలో ఇప్పటి వరకు దాదాపుగా 1.60 లక్షల వాహనాలను హైదరాబాద్ పోలీసులు సీజ్‌ చేశారు. ఇందులో సివిల్‌ పోలీసులు లక్షకు పైగా, ట్రాఫిక్‌ పోలీసులు మరో 50 వేల వరకు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సీజ్ చేసిన వాహనాల సంఖ్య రెండు లక్షలు దాటొచ్చు. ఈ వాహనాలలో 90 శాతం ద్విచక్ర వాహనాలు కాగా మిగిలినవి ఆటోలు, కార్లు, ఇతర వాహనాలు. ఒక్కో వాహనానికి రూ.500 చొప్పున రెండు లక్షల వాహనాలకు రూ.10కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దీనికి తోడు లాక్‌ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, ట్రాఫిక్ చట్టాలను కూడా ఉల్లంఘించిన వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 1.22 లక్షల ఇ-చలాన్‌ లను జారీ చేశారు. ఈ ఆదాయం కూడా కలుపుకుంటే మరింత ఆదాయం ట్రాఫిక్ ఖాతాలోకి వెళ్లనుంది.