1996 లో ‘కల్యాణ ప్రాప్తిరస్తు ‘ చిత్రం తో హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వక్కంతం వంశీ ఆ తరవాత రచయిత గా మారి పలువురు స్టార్ హీరోలకు కధలు అందించాడు. ”కలుసుకోవాలని , అశోక్ , కిక్ , కిక్ 2 , అతిధి , ఎవడు , రేస్ గుర్రం , ఊసరవెల్లి , టెంపర్ ” వంటి చిత్రాలకు కధలు అందించిన వక్కంతం వంశీ . ఇప్పుడు దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు .. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఆయనకు దర్శకుడిగా మొదటి సినిమా. కాగా తొలి చిత్రం ఆశించిన సక్సెస్ ఇవ్వని నేపధ్యం లో ఇపుడు దర్శకుడిగా రెండో సినిమా రూపొందించడానికి రెడీ అవుతున్నాడు ..ఆ క్రమంలో మాస్ మహా రాజా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపిస్తే.. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయుమని చెప్పాడట.
మందు ఓపెన్.. గుడులు, పనులు బంద్ న్యాయమా?
మాస్ రాజా రవితేజతో గతంలో ” కిక్ , కిక్2 ” టచ్ చేసి చూడు ” చిత్రాలకు పనిచేయడం వల్ల వక్కంతం వంశీకి దర్శకుడిగా అఫర్ ఈజీ గానే వచ్చింది .. రవితేజతో మొదటిసారి ” కిక్” సినిమా కి పనిచేసిన వక్కంతం వంశీ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇపుడు దర్శకుడిగా కూడా మెమొరబుల్ హిట్ ఇవ్వాలని అనుకొంటున్నాడట …