పక్కా ప్లానింగ్ తో రెండో దశ లాక్ డౌన్?!

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా ఒక్కసారిగా భారత్ పై పడి, అటు అధికారులను, ఇటు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేయడంతో.. ఏమి పాలుపోని భారత్ యంత్రాంగం ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం జరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేసి మరలా మే లో రెండో దశ లాక్ డౌన్ ను అమలు పరిచే సూచనలు కనిపిస్తున్నాయి. […]

Written By: Neelambaram, Updated On : April 6, 2020 1:27 pm
Follow us on

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా ఒక్కసారిగా భారత్ పై పడి, అటు అధికారులను, ఇటు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేయడంతో.. ఏమి పాలుపోని భారత్ యంత్రాంగం ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం జరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేసి మరలా మే లో రెండో దశ లాక్ డౌన్ ను అమలు పరిచే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ విషయంపైనే ఏప్రిల్ 3న 16 మందితో కూడిన ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు.

ఈ మీటింగ్ అనంతరం కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 14 న లాక్‌ డౌన్ ఎత్తేసిన తర్వాత…. మే 15 నుంచి రెండో దశ లాక్‌ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని కేంద్ర మంత్రుల మధ్య చర్చ వచ్చినట్లు సమాచారం. అయితే మొదటి దశ లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఏ దుకాణాలు తెరవాలి? ఏ దుకాణాలు మూసి ఉంచాలన్నది కూడా మంత్రులు మాట్లాడుకున్నారు. లాక్‌ డౌన్ ఎత్తేసినా సరే… నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంచాలని,  అయితే ప్రజలు గుమిగూడటంపై మాత్రం నిషేధం కొనసాగించాలని వారు భావించినట్లు సమాచారం. సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలను మాత్రం తెరవకూడదన్న నిబంధన విధించాలని భావించారు

అయితే నిత్యావసరాలను అమ్మే మాల్స్‌కు, విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చి, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగింది.  అయితే కరోనా వైరస్‌ తో బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రం వారం వారం సంతలకు అనుమతి ఇవ్వకూడదని, రాష్ట్రమంతటా కోవిడ్ – 19 పై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రులు భావించారు.

మరోవైపు క్వారంటైన్‌ లో ఉంటున్న వారిని జీపీఎస్ ట్రాకర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు, బాధ్యులు పర్యవేక్షించాలని, అయితే ఇది ఎంత వరకు సాధ్యమనేది మంత్రులు చర్చించారు.

ఇకపోతే ‘వర్క్ ఫ్రం హోం’ చేసే ఉద్యోగులకు మరో నెల పాటు ఇదే వసతి కొనసాగిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక ఆసుపత్రుల్లో కూడా అత్యధికంగా రద్దీ లేకుండా ఆయా యాజమాన్యాలే బాధ్యత వహించేలా చూడాలని మంత్రుల బృందం భావించినట్లు సమాచారం.