జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను రక్షించగలరా?

ఇప్పటికే వీలున్న చోటల్లాఅప్పులు  చేస్తూ కాలం గడుపుతున్న తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో చిక్కుకు పోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అప్పు పరిమితిని పెంచమని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసింది. కేంద్రం ఆమోదిస్తే మరింత భారీగా రుణాలు సమకూర్చుకునేందుకు చూస్తున్నది. అయితే కేంద్రం నుండి స్పందన లభిస్తున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం జిఎస్‌డిపిలో మూడు శాతం వరకు రుణాలు తీసుకునేరదుకు కేంద్రం అనుమతి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 1:53 pm
Follow us on

ఇప్పటికే వీలున్న చోటల్లాఅప్పులు  చేస్తూ కాలం గడుపుతున్న తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో చిక్కుకు పోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అప్పు పరిమితిని పెంచమని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసింది. కేంద్రం ఆమోదిస్తే మరింత భారీగా రుణాలు సమకూర్చుకునేందుకు చూస్తున్నది. అయితే కేంద్రం నుండి స్పందన లభిస్తున్న దాఖలాలు లేవు.

ప్రస్తుతం జిఎస్‌డిపిలో మూడు శాతం వరకు రుణాలు తీసుకునేరదుకు కేంద్రం అనుమతి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి 3.5 శాతం వరకు ఈ పరిమితిని పెంచారు. అయితే చాలాసార్లు 3.5 శాతం పరిమితి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలు రాలేదు. ఈ నేపథ్యరలోనే నాలుగు శాతానికి పరిమితి పెరచాలని కేంద్రానికి లేఖ రాయడం విశేషం.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వృద్ధి రేటులో మూడు శాతానికి మించి రుణం తీసుకోరాదు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మరో అర శాతం రుణం తీసుకునేందుకు అనుమతి ఉంది. అయితే రాష్ట్రానికి ఈ వెసులుబాటు లభించడం లేదు. దీనిపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం నుండే కేంద్రానికి లేఖలు వ్రాస్తూ వస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లోటులో కూరుకుపోయిందని, రుణాలను 58.32 శాతాన్ని రాష్ట్రానికి పెంచడం కూడా ఆర్ధిక సమస్యకు కారణమైందని తాజా లేఖలో పేర్కొన్నారు. ఆ రుణాలకు వడ్డీ కూడా రాష్ట్రమే భరించాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. దీనివల్ల ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితిలోకి ఈ రుణాలు చేరుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడుతోందని తెలిపారు.

ఇదే సమయంలో ఆర్థిక పరిస్థితి
కూడా నిరాశాపూరితంగా ఉన్నట్లు కేంద్రానికి తెలిపారు. దీనివల్ల సాధారణ మౌలిక సౌకర్యాల కల్పనకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నీటిపారుదల పథకాలు, రోడ్లు, విద్యా సంస్థలు, ఇతర రంగాల అభివృద్ధికి నిధుల లేమి నెలకొందని వివరించారు. ఇటువంటి ప్రధాన సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలు తీసుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.