
కరోనా వైరస్ ఇప్పుడు ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావిత అంశం అయ్యింది. కరోనా ఎపుడు ఏ రూపం లో వస్తుందో ఎవరూ చెప్పలేక పోతున్నారు.. దీన్ని అరికట్టడం ఎలా అన్నదే ప్రస్తుతం ప్రపంచం ముందున్న సమస్య. ఆ క్రమంలో ప్రభుత్వాలు ప్రజల నుంచి ఏదైనా తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయం ఏదైనా లభిస్తుందేమోనన్నఆలోచనతో ఉన్నాయి సరిగ్గా ఆ దిశగా ఒక అడుగు ముందుకు పడింది. వీరు చెప్పేదాన్ని బట్టి 50 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుని మనుగడ సాగించగలిగే కరోనా వైరస్ భూతాన్ని వ్యాప్తి చెంద కుండా ఆపొచ్చని తెలుస్తోంది.
కర్ణాటకకు చెందిన కొందరు సాంకేతిక నిపుణులు తాము కనుగొన్న పరికరం కొన్ని నిమిషాల సేపు స్విచాన్ చేస్తే చాలని, ఆయా వస్తువులపై వుండే ఎటువంటి సూక్ష్మ క్రిములనైనా అది రూపుమాపు తుందని వెల్లడించారు.ఈ మేరకు వారు ఓ పాత రిఫ్రిజిరేటర్ ను కరోనా నిర్మూలన పరికరంగా మార్చారు. దీనిని జీరో కరోనా వైరస్ పరికరంగా వారు పేర్కోనున్నారు .
కర్ణాటకలోని సూరత్ కల్ లో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీకే) కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ అరుణ్ ఎం ఇస్లూర్ తో కల్సి రీసెర్చ్ స్టూడెంట్ సయ్యద్ ఇబ్రహీం సంయుక్తంగా ఈ జీరో కరోనా పరికరాన్ని రూపొందించారు. వారు చెప్పేదాన్ని బట్టి ఈ రిఫ్రిజిరేటర్ లో ఎలాంటి వస్తువులను ఉంచినా, వాటిపై ఉన్న సూక్ష్మక్రిములను ఇది వంద శాతం నాశనం చేస్తుందట… అలా ఇది 99.9 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని డాక్టర్ ఇస్లూర్ తెలిపారు. కూరగాయలు, పండ్లు, పుస్తకాలు, కరెన్సీ నోట్ల, కవర్లు.. ఇలా ఏ వస్తువును ఈ రిఫ్రిజిరేటర్ లో ఉంచినా ఇన్ఫెక్షన్ రహితంగా మార్చేస్తుందని వివరించారు.నిజంగా ఈ ఫ్రిజ్ అంతపని చేస్తే మానవాళికి ఎంతో కొంత మేలు చేసిన వారు గా చరిత్రలో నిలిచి పోతారు .