
`ఆల వైకుంఠపురం లో` చిత్రం ఇచ్చిన కిక్ తో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను భారీ ప్లాన్‌తోనే సెట్ చేసుకొని విడుదల చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా మూవీ ` పుష్ప ` పై చాలా కేర్ తీసుకుంటున్నాడు .. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఈపాటికి పుష్ప సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఉండేది. కూడా … లాక్‌డౌన్ తీసివేశాక ` పుష్ప` సినిమాను వీలైనంత తర్వగానే పూర్తి చేయాలను కొంటున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్‌లో పుష్ప చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ వేస్తున్నారు. అలా తన 20వ సినిమా గురించి ఆలోచిస్తున్న బన్నీ తన తదుపరి సినిమాను కూడా స్టార్ డైరెక్టర్‌తోనే చేయబోతున్నాడట
తొలి చిత్రం ‘అర్జునరెడ్డి’తో విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా మార్చిన సందీప్ వంగా ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. దాంతో తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబు తో చేయాలనుకున్నాడు. కానీ కుదరలేదు. అంతలోనే హిందీలో అర్జున్ రెడ్డిని `కబీర్ సింగ్ `పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ భారీ హిట్ కొట్టాడు. మళ్లీ ఇపుడు తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో చివరకు బన్నీతో సందీప్ సినిమా సెట్ అయినట్టు తెలుస్తోంది.. అయితే బన్నీఇప్పుడు చేస్తున్న `పుష్ప` చిత్రం తర్వాత దిల్‌రాజు బ్యానర్‌లో `ఐకాన్ ` సినిమా పూర్తి చేయాల్సి ఉంది. మరి అప్పటి వరకు సందీప్ వంగా వెయిట్ చేయక తప్పేలా లేదు .