
దేశంలో మహమ్మారి విజృంభన నేపథ్యంలో అనుకోకుండా విధించబడిన లాక్ డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలలో లక్షల మంది వలస కూలీలు చిక్కుకుపోయారు. తాజాగా వారిని తమ తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ శ్రామిక్ అనే ప్రత్యేక రైళ్లను వలస కూలీల కోసం వెయ్యడంతో… ఎక్కడెక్కడో ఉన్న వారంతా… తమ సొంత రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు. ఐతే… ఇలా వెళ్లేవారు… తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం… ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నోడల్ అధికారుల్ని ఏర్పాటు చేశాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు ఈ నోడల్ అధికారుల మొబైల్ నంబర్లకు కాల్ చేసి… మాట్లాడవచ్చు.
- తెలంగాణ: సందీప్కుమార్ సుల్తానియా: 07997950008
- ఆంధ్రప్రదేశ్: ఎంటీ కృష్ణబాబు : 09177611110
- గుజరాత్‌లో ఏపీ, తెలంగాణ, ఇతర దక్షిణాది రాష్ట్రాల వారి కోసం: పి.భారతి, 9978408545,
వి.చంద్రశేఖర్, 9845044606 - జార్ఖండ్ లో ఆంధ్రప్రదేశ్ వాళ్ల కోసం:
అమితాబ్ కౌశల్, 9431160011 - కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి కోసం:
ఎన్వీ ప్రసాద్ 9448146360
మాలినీ కృష్ణమూర్తి 9480800026 - మధ్యప్రదేశ్ లో ఏపీ, తెలంగాణ వారి కోసం:
వి.కిరణ్ గోపాల్ – 9425163993 - రాజస్థాన్ లో ఆంధ్రప్రదేశ్ వారి కోసం:
జంగా శ్రీనివాసరావు- 9929799297 - మహారాష్ట్రలో ఉన్న వారి కోసం :
నితిన్ కరీర్ – 022-22027990 - తమిళనాడులో వారి కోసం:
అతుల్య మిశ్ర- 9940341445