మోడీ మౌనం.. ట్రంప్ సీరియస్!

“మా ఇంటికొస్తే నాకేమి తెస్తావ్.. మీ ఇంటికొస్తే నాకేమి ఇస్తావ్’ అని తెలుగులో ఒక సామెత ఉందిలే.. ప్రస్తుతం అమెరికా పరిస్థితీ అలానే ఉంది. ఒక వైపు యావత్ భూగోళం కరోనా భయంతో అల్లాడిపోతుంటే.. అగ్రరాజ్యం తన వ్యాపార లబ్ది కోసం మరియు తమ దేశంలో కరోనా కట్టడికోసం అనవసరమైన తప్పిదాలు చేయడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే..అమెరికాలో 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల నిల్వలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక వీడియో […]

Written By: Neelambaram, Updated On : April 7, 2020 12:50 pm
Follow us on

“మా ఇంటికొస్తే నాకేమి తెస్తావ్.. మీ ఇంటికొస్తే నాకేమి ఇస్తావ్’ అని తెలుగులో ఒక సామెత ఉందిలే.. ప్రస్తుతం అమెరికా పరిస్థితీ అలానే ఉంది. ఒక వైపు యావత్ భూగోళం కరోనా భయంతో అల్లాడిపోతుంటే.. అగ్రరాజ్యం తన వ్యాపార లబ్ది కోసం మరియు తమ దేశంలో కరోనా కట్టడికోసం అనవసరమైన తప్పిదాలు చేయడం గమనార్హం.

అసలు విషయం ఏమిటంటే..అమెరికాలో 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల నిల్వలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇది కరోనా ని నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. అయితే ఈ ఔషధం కరోనాను పూర్తిగా నియంత్రిస్తుందని ఇంతవరకూ ఎక్కడా నిరూపితం కాలేదు. దింతో చాల దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల దిగుమతుల పై ఆంక్షలు విధించాయి. అందులో భారత్ కూడా ఒకటి. ఈ ఔషదాన్ని ఎగుమతి చేసుకోవాల్సిందింగా అమెరికా, భారత్ ని కోరింది. కానీ ఔషధం కరోనాను ఎదుర్కొంటుందని ఎక్కడా తేలకపోవడతో మోడీ ప్రభుత్వం సందిగ్ధంలో పడి, ఈ ఔషధ దిగుమతుల పై స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. భారత్ మౌనం పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇదే విషయం పై ట్రంఫ్ మాట్లాడుతూ.. “అమెరికా భారత్ మధ్య దౌత్య సంబంధాలకు మించిన స్నేహబంధం ఉందని, ఈ రెండు దేశాల మధ్య స్నేహపూరక వాతావరణం ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ.. తాను ఆశించిన విధంగా భారత్ స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు.

భారత్, ఎందుకని హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల దిగుమతిపై మౌనంగా ఉంది?

ఈ ఔషధం కరోనాను పూర్తిగా నియంత్రిస్తుందని ఇంతవరకూ ఎక్కడా నిరూపితం కాలేదు. ఇప్పటివరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్, కరోనాను ఎదుర్కొంటుందని ఎక్కడా స్పష్టమైన సంకేతాలు రాలేదు. దీనికి తోడు ఈ ఔషధంపై ట్రంప్ మాట్లాడిన తర్వాత ఆ దేశ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అంత్ ఇన్ఫెక్టియస్ డిసీజస్ డైరెక్టర్ డాక్టర్ ఆంధోనీ ఫౌసీ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. డొనాల్డ్ ట్రంప్ కు డాక్టర్ ఫౌసీ అత్యంత విధేయుడు. అయినా సరే డ్రగ్ పై అతన్ని మాట్లాడనించకపోవడానికి కారణం ఏమిటో ఎవరికి తెలియదు. కేవలం వ్యాపార లబ్ధికోసం ఎగుమతి చేస్తున్నారు తప్ప కరోనా ని నియంత్రిస్తుందన్న నమ్మకం లేదు. అందుకే భారత్ ఈ విషయంపై మౌనం వహించింది. ఈ డ్రగ్ ను ఇప్పటికే అమెరికాలో సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పుడు కరోనా రోగులకు కూడా ఇది లభించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటె.. చైనా నుంచి జర్మనీకి వెళుతున్న 2 లక్షల ఎన్-95 మాస్క్ లున్న విమానాన్ని అమెరికా దొంగిలించిందనే వార్త ఈ నెల 3వ తేదీన కలకలమే రేపింది. బెర్లిన్ పోలీస్ ఫోర్స్ ఈ మాస్క్ లను తమ దేశ అవసరాల కోసం చైనా లో ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ పై వస్తున్న జర్మనీకి వెళుతున్న 2 లక్షల ఎన్-95 మాస్క్ లున్న విమానాన్ని అమెరికా తమ దేశం వైపు మరల్చింది. ఇది సహేతుకమైన పని కాదని జర్మనీ ఖండించింది. జర్మనీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. ప్రపంచంలోనే కరోనా సోకిన నాలుగో అతిపెద్ద దేశంగా జర్మనీ నిలిచింది.

ఈ విధంగా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు, ఆయన వైఖరి ఆ దేశ లాభం తప్ప, ఇతరుల కష్టాన్ని వారు పట్టించుకోవడం లేదనే వాదన అనేక దేశాలలో వినబడతోంది.