కరోనా వైరస్‌ను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నాయని, కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లండని జగన్ తెలిసి అన్నాడో లేక తెలియక అన్నాడో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. పాపం బాగా పెరిగినప్పుడు దేవుడు గానీ, ప్రకృతి గాని ఇలాంటిది ఒకటి సృష్టించి కొంత జనాభాను తగ్గిస్తున్నాయని చెప్పారు. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటే కరోనా రాదని చెప్పారు. అందుకోసమే తాడిపత్రి పట్టణాన్ని వదిలి, జూటూరులో ఉన్న తోటలో ఉంటున్నానని జేసీ చెప్పారు. ఇక్కడ పండిన పంటలతో రూ. కోటి వరకూ సంపాదించానన్నారు. తన శేష జీవితం మొత్తం జూటూరులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో గడపాలని ఆశగా ఉందని జేసీ తెలిపారు.