https://oktelugu.com/

కష్టకాలంలో కూడా ఇంత నిర్లక్ష్యమా?

మొన్న మొన్నటి వరకు మాస్కులు లేవని మోత్తుకున్నారు. గ్లౌజ్‌లు ఇవ్వడంలేదని గోల చేశారు. పీపీఈ కిట్లు తక్కువగా ఉన్నాయని గోడవ చేశారు. ఎట్టకేలకు ఇత్యాది సమస్యలు ఎంతోకొంత సర్దుమనిగాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరో చిక్కొచ్చి పడ్డది. ప్రజలు వారు ఉపయోగించుకున్న మాస్కులు, గ్లౌజ్‌లను బాధ్యతా రాహిత్యంగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరో సమస్యకు కారణమౌతున్నారు. ప్రజలు వినియోగిస్తున్న మాస్కులను విధుల్లో, రోడ్లపైన పడేస్తూ ఉన్నారు. కరోనాపైన యావత్తు భారతావని యుద్ధం చేస్తున్న తరుణంలో, కేంద్ర, రాష్ట్ర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2020 / 08:54 PM IST
    Follow us on


    మొన్న మొన్నటి వరకు మాస్కులు లేవని మోత్తుకున్నారు. గ్లౌజ్‌లు ఇవ్వడంలేదని గోల చేశారు. పీపీఈ కిట్లు తక్కువగా ఉన్నాయని గోడవ చేశారు. ఎట్టకేలకు ఇత్యాది సమస్యలు ఎంతోకొంత సర్దుమనిగాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరో చిక్కొచ్చి పడ్డది. ప్రజలు వారు ఉపయోగించుకున్న మాస్కులు, గ్లౌజ్‌లను బాధ్యతా రాహిత్యంగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరో సమస్యకు కారణమౌతున్నారు. ప్రజలు వినియోగిస్తున్న మాస్కులను విధుల్లో, రోడ్లపైన పడేస్తూ ఉన్నారు.

    కరోనాపైన యావత్తు భారతావని యుద్ధం చేస్తున్న తరుణంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పోరు సల్పుతున్న సమయంలో, పేషెంట్లకు వైద్య సేవలందించడంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మునిగిపోయిన ఈ విపత్కర కాలంలో కొంతమంది ప్రజలు మాస్కులను, గ్లౌజ్‌లను, వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ కిట్ల) ను ఇలా విధుల్లో, రోడ్లపైన, ఇంటి గేట్ల ముందు పడేయడం అనేకమందిని విస్మయానికి గురిచేస్తుంది.

    ప్రజలు వినియోగిస్తున్న మాస్కులను, గ్లౌజ్‌లను, వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ కిట్ల)ను సురక్షితంగా డిస్పోజ్ చేయాలని, వీటిని రోడ్లపై, నివాసాల్లోని చెత్త బుట్టల్లో పడేయడం వల్ల వాటిని పెంపుడు జంతువులు, వీధుల్లో సంచరించే పశువులు తాకితే వైరస్‌ వ్యాప్తిచెంది అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా.. కొంత మంది ఈ హెచ్చరికలను భేఖాతారు చేయడం సిగ్గుచేటు. అంతేకాకుండా చిత్తుకాగితాలు ఏరుకునే వారు వాటిని సేకరించి మళ్లీ విక్రయించే అవకాశం ఉందని అది మరింత ప్రమాదమని కూడా కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    కింకర్తవ్యం

    ఎవరైతే మాస్కులు, గ్లౌజ్‌లను ఉపయోగిస్తున్నారో వారు వ్యక్తిగత బాధ్యత వహించి వినియోగించిన మాస్కులు, గ్లౌజ్‌లను ముక్కలుముక్కలుగా చేసి తగిన పద్దతిలో డిస్పోజ్ చేయాలి. ప్రజారోగ్య సిబ్బంది కూడా వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేక సంచుల ద్వారా వాటిని సేకరించిన మాస్కులను,గ్లౌజ్‌లను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్‌ చేస్తే పరోక్షంగా వైరస్ కట్టడికి సహకరించినవారౌతారు. అలాగే ఎవరికైనా రోడ్లపైన, విధుల్లో ఎక్కడైనా మాస్కులు, గ్లౌజ్‌లు కనిపించినట్లయితే వాటిని సేకరించి ముక్కలుముక్కలుగా చేసి తడి పొడి చెత్తతో కాకుండా విడిగా ఓ పేపరు కవర్‌ లోగానీ, ప్యాకెట్‌ లోగానీ కాగితంలో చుట్టి చెత్తసేకరణకు వచ్చే పారిశుధ్య సిబ్బందికి అందజేయాలి. ప్రజలు పెంపుడు జంతువుల విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యత వహించి వైరస్ నియంత్రణకు సహకరిస్తారని ఆశిద్దాం…