కేటీఆర్ లో కొత్త కోణం.. షాక్ లో కెసిఆర్

2014లో మొదటిసారి, 2018లో రెండవసారి తెరాస పార్టీ తెలంగాణాలో అధికార పీఠం ఎక్కింది. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాలలో కెసిఆర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మూడో ఫ్రాంట్ ఏర్పాటుకు తెరాస ముందుంటుందని కెసిఆర్ ప్రగల్బాలు పలికారు. ఆ తర్వాత ఏమి జరిగిందో.. ఏమోగాని కెసిఆర్ ఆ విషయంలో మౌనం వహించాడు. బహుశా మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాడేమో తెలియదు. కానీ జాతీయ నాయకునిగా ఎదగాలని కెసిఆర్ కి తన మనసులో ఉందనేది వాస్తవం. […]

Written By: Neelambaram, Updated On : February 15, 2020 2:41 pm
Follow us on


2014లో మొదటిసారి, 2018లో రెండవసారి తెరాస పార్టీ తెలంగాణాలో అధికార పీఠం ఎక్కింది. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాలలో కెసిఆర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మూడో ఫ్రాంట్ ఏర్పాటుకు తెరాస ముందుంటుందని కెసిఆర్ ప్రగల్బాలు పలికారు. ఆ తర్వాత ఏమి జరిగిందో.. ఏమోగాని కెసిఆర్ ఆ విషయంలో మౌనం వహించాడు. బహుశా మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాడేమో తెలియదు. కానీ జాతీయ నాయకునిగా ఎదగాలని కెసిఆర్ కి తన మనసులో ఉందనేది వాస్తవం.

అసల విషయం ఏమిటంటే.. మొన్న టైమ్స్ నౌ సమ్మిట్, నిన్న నాస్కామ్ సాంకేతిక నాయకత్వ వేదిక సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సదస్సుల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీలు లేవని, ఇప్పుడున్న పార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని చెప్పటం, కేంద్రం పుచ్చుకునే స్థితిలో ఉందని, బీజేపీ, కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయి కాబట్టి ప్రాంతీయ పార్టీల కూటమే శరణ్యమని ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేయటం. రాష్ట్రస్థాయి ధాటి జాతీయ స్థాయిలో అడుగుపెట్టాలనుకునే తెరాస కి ఇది మింగుడు పట్టని అంశం. కెసిఆర్ ఒక జాతీయ నాయకునిగా మాట్లాడితే బాగుండేదని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుతానికి తెరాస, ప్రాంతీయ పార్టీ, తర్వాత జాతీయ పార్టీ అవుతుందో లేదో చెప్పలేం, కానీ ఒకవేళ కెసిఆర్ జాతీయ నాయకునిగా చలామణి కావాలనుకుంటే.. కేటీఆర్ పరిపక్వత కలిగి మాట్లాడితే బాగుండేది. ఆప్ విషయానికి వస్తే.. ఢిల్లీ ఒక్క రాష్ట్రంలోనే పరిపాలనలో వున్నా..దేశ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ ని ప్రాంతీయ పార్టీ నాయకుడుగా చూడటంలేదు. ఎందుకని? అదే కెసిఆర్ ని తెలంగాణ నాయకుడుగానే చూస్తున్నారు.ఈ నిజాన్ని మంత్రి కేటీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.