తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ దాని విధి విధానాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ధరణి పోర్టల్‌ను కొత్తగా రూపొందించాలని, అందులో మార్పులు చేర్పులు చేయాలని సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఈ పోర్టల్‌లో పట్టణ, పురపాలక పన్ను రికార్డులను కూడా అనుసంధానం చేసే అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం.
Also Read: కోవిడ్ నిధులపై బండి-కేటీఆర్ కొట్లాట..!