
నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, తండ్రి కెసిఆర్ పై అలిగినట్లుగా తెలుస్తోంది. 2018 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత కవిత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ కవితకు దక్కుతుందని అందరూ భావించారు. తెరాసలో గత కొన్ని నెలల నుంచి ఈ చర్చ జరిగింది. ఆమె కూడా రాజ్యసభ సీట్ పై ఆశలు పెట్టుకుంది. కానీ కెసిఆర్ మాత్రం కవితకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు.దింతో కవిత, కెసిఆర్ పై అలిగినట్లు సమాచారం.
కవిత అలక ను పోగొట్టడానికి ఇప్పటికి రాజ్యసభ సీట్ ఇవ్వకపోయినా… ఆమెను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కెసిఆర్ మంత్రివర్గంలో కేటీఆర్, హరీశ్ రావు ఉండటంతో…. కవితకు ఆ అవకాశం ఉండకపోవచ్చనే చర్చ పార్టీ వర్గాలలో జరుగుతోంది. మరోవైపు కవితను మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయాలనే ఆలోచన కేసీఆర్ కు ఉంటే… ఇప్పటికే పార్టీ నేతల నుంచి ఆ దిశగా సంకేతాలు వచ్చేవని కొందరు చెబుతున్నారు. అయితే ఇటు పార్టీ నేతల నుంచి కానీ, అటు కవిత నుంచి కానీ… ఇందుకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రావడం లేదు. ఏపీలో చంద్రబాబు తనయుడు లోకేష్ కి జరిగిందే తెలంగాణాలో కవితకు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. కవితని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక కెసిఆర్ ఇంకేమైనా ఆలోచిస్తున్నారా..? అనేది తెలియాల్సిన ఉంది.