https://oktelugu.com/

డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల వేట

కుమ్రం భీం అసిఫిబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం వేట మొదలైంది. కాగజ్ నగర్ మండలం కడంబ ఎన్ కౌంటర్ తర్వాత మూడో రోజు కొనసాగుతోంది. డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల వేట కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ లతో జల్లెడ పడుతున్నారు గ్రేహౌండ్ పోలీసులు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడేల్లు అలియాస్ భాస్కర్ టార్గెట్ గా కూంబింగ్ ఆపరేషన్ సాగుతోంది. పెంచకల్ పెట్ (మ) సిద్దేశ్వర […]

Written By: , Updated On : September 22, 2020 / 12:12 PM IST
Follow us on

Hunting of Maoists

కుమ్రం భీం అసిఫిబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం వేట మొదలైంది. కాగజ్ నగర్ మండలం కడంబ ఎన్ కౌంటర్ తర్వాత మూడో రోజు కొనసాగుతోంది. డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల వేట కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ లతో జల్లెడ పడుతున్నారు గ్రేహౌండ్ పోలీసులు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడేల్లు అలియాస్ భాస్కర్ టార్గెట్ గా కూంబింగ్ ఆపరేషన్ సాగుతోంది.
పెంచకల్ పెట్ (మ) సిద్దేశ్వర గుట్ట లోడ్పెల్లి చింతనమనేపల్లి గూడెం ప్రాణహిత నదీ సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలిసింది. ఈనెల 19న కదంబ అడవుల్లో ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందిన సంగతి తెలిసిందే.

Also Read: దేశవ్యాప్త రైతు ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం?