కరోన ఫేక్ అలెర్ట్… ఈ వార్తలను నమ్మకండి!

కరోనా వ్యాప్తి చెందడంతో పాటు సోషల్ మీడియా లో దానిపై వదంతులు కూడా అదే మొత్తంలో వ్యాప్తి చెందాయి. దేశంలో వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న వేళ దానిపై అసత్యపు పోస్టులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇతరులకు అవగాహన ముసుగులో కొందరు ఫేక్‌ న్యూస్‌ ను ప్రచారం చేస్తుండడం బాధాకరం. ఇటీవల కాలంలో కొన్ని ఫేక్ న్యూస్ బాగా వైరల్ అయ్యాయి. రష్యాలో సింహాలను వీధుల్లోకి వదిలారని,ఇటలీలో కుప్పలు తెప్పలుగా శవాలను పూడ్చిపెడుతున్నారని, జియో సంస్థ […]

Written By: Neelambaram, Updated On : March 28, 2020 1:27 pm
Follow us on

కరోనా వ్యాప్తి చెందడంతో పాటు సోషల్ మీడియా లో దానిపై వదంతులు కూడా అదే మొత్తంలో వ్యాప్తి చెందాయి. దేశంలో వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న వేళ దానిపై అసత్యపు పోస్టులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇతరులకు అవగాహన ముసుగులో కొందరు ఫేక్‌ న్యూస్‌ ను ప్రచారం చేస్తుండడం బాధాకరం.

ఇటీవల కాలంలో కొన్ని ఫేక్ న్యూస్ బాగా వైరల్
అయ్యాయి. రష్యాలో సింహాలను వీధుల్లోకి వదిలారని,ఇటలీలో కుప్పలు తెప్పలుగా శవాలను పూడ్చిపెడుతున్నారని, జియో సంస్థ లైఫ్‌ టైమ్‌ ప్లాన్‌ ను కేవలం రూ.498కే అందిస్తోందని, మొదలైన వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియా లో వైరల్ అయిన ఈ వార్తలు ఏవీ కూడా నిజం కాదని తేలాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా రష్యా ప్రభుత్వం సుమారు 500 సింహాలను రోడ్లపైకి విడిచిపెట్టారంటూ చేసిన ప్రచారం అవాస్తవం. అది 2016లో దక్షిణాఫ్రికాలో ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా తీసిన చిత్రమిది.

అలాగే కరోనా కారణంగా ఇటలీలో చనిపోయిన వారిని పెద్ద ఎత్తున వాహనాల్లో తరలించి గుట్టలుగా పోస్తున్నారన్నది కూడా అవాస్తవం. అది కూడా ఒక థ్రిల్లర్‌ చిత్రంలోని వీడియో.

కరోనా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇది బాగా వైరల్‌ అయ్యింది. భారత్ లో జియో కొత్త లైఫ్ టైం ప్లాన్ కేవలం రూ.498కే అందిస్తోందని, అందుకోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి అంటూ ఓ పోస్ట్‌ సర్క్యులేట్‌ అయింది. ఇది సైబర్‌ నేరగాళ్ల పని అని జియో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.