13 గంటలు వరదనీటిలోనే..

ఆంధ్రప్రదేశ్‌లోని పెన్నానదిలో దాదాపు 13 గంటల పాటు వరదనీటిలోనే ఉండి చివరికి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బయటపడ్డాడో వ్యక్తి. నెల్లురు జిల్లాలోని గూడురు పాత బస్టాండ్‌కు చెందిన రాంబాబు కూలి పని కోసం నెల్లూరులో జీవనం సాగిస్తున్నాడు. నెల్లూరులోని భగత్‌సింగ్‌ కాలనీ సమీపంలో ఉన్న పెన్నానది నూతన బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నది ఉధృతి పెరగడంతో మధ్యలోనే చిక్కుకున్నాడు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సాయం కోసం ఎదురుచూశాడు. సమాచారం అందుకున్న […]

Written By: NARESH, Updated On : September 20, 2020 1:20 pm

penna river

Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని పెన్నానదిలో దాదాపు 13 గంటల పాటు వరదనీటిలోనే ఉండి చివరికి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బయటపడ్డాడో వ్యక్తి. నెల్లురు జిల్లాలోని గూడురు పాత బస్టాండ్‌కు చెందిన రాంబాబు కూలి పని కోసం నెల్లూరులో జీవనం సాగిస్తున్నాడు. నెల్లూరులోని భగత్‌సింగ్‌ కాలనీ సమీపంలో ఉన్న పెన్నానది నూతన బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నది ఉధృతి పెరగడంతో మధ్యలోనే చిక్కుకున్నాడు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సాయం కోసం ఎదురుచూశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రాంబాబును రక్షించారు.