కరోనా సంక్షోభం కారణంగా దేశంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్ లో క్లాసులు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం ఒధ్యరం గ్రామానికి చెందిన సిర్రం శివరాం తలితండ్రులను ఇబ్బందిపెట్టకుండా మూడు నెలలు కూలి పనిచేసి కూడగట్టిన డబ్బుతో ఫోన్ కొనుక్కొని పాఠాలు వింటున్నాడు. చదువుకునేందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన విద్యార్థిని స్కూలు టీచర్ అభినందించారు.
Also Read : టీటీడీపీ మార్పు ఖాయమా.. బాబు ఆలోచన ఏంటీ?