
దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు హ్యాట్స్ ఆప్ చెప్పిన విషయం తెల్సిందే. జగన్ కూడా అదేతరహాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుండి హ్యాట్స్ ఆప్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ మూడు రోజుల క్రితం ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. అయితే సీఎం జగన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభినందించారు. మహిళలపై దాడుల నిరోధించడానికి దిశ చట్టం తేవడంపై ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీ దిశ చట్టం 2019పై ఢిల్లీ సర్కారు ఆసక్తి కనబరిచింది. దిశ చట్టం కాపీ తమకు పంపాలని కేజ్రీవాల్ సర్కారు విజ్ఞప్తి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేజ్రీవాల్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. దీనిపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీకి ఇది గర్వకారణం అని ఆయన అన్నారు. త్వరలోనే గవర్నర్ ఆమోదించిన దిశ చట్టం కాపీని ఢిల్లీ ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన ప్రకటించారు.
ఏపీ క్రిమిలన్ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్‌కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్ కేసుపై జడ్జిమెంట్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయనున్నారు.