
ఏపీ బీజేపీ నాయాకులు పవన్ కళ్యాణ్ తో కలిసి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి..తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు. రాజధాని ఎలా కదులుతుందో చూస్తాం..అని బీజేపీ నేత కన్నా అంటే…రాజధాని శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది అని పవన్ మాట ఇచ్చారు. వీళ్లంతా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అనే ధీమాతో ఇన్ని రోజులు ప్రజల్లో తిరిగారు.
నిన్న గళ్ళ జయదేవ్ పార్లమెంట్ లో రాజధాని విషయం ప్రస్తావిస్తే…రాజధాని ఎంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో పవన్ మరియు బీజేపీ నాయకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి.
రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తే… కేంద్ర బీజేపీ ఇంకోటి చెబుతుంది. దీనికి తోడు మధ్యలో పవన్ ఎటు తేల్చుకొలేని పరిస్థితిలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగ నిలదీద్దామా అంటే పొత్తు కారణంగా మాట్లాడలేని పరిస్థితి. ఇది ఇలానే ఉంటె జగన్ చక చక తన పనులు చేసుకుంటూ పోతాడు. ఏది ఏమైనా పవన్ మరియు కన్నా లక్ష్మినారాయణ చేసిన హడావుడికి…కేంద్రం నుంచి వచ్చిన సమాధానికి అస్సలు పొంతనే లేదు. ఇప్పుడు వీళ్ళు తమ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా నిర్మించుకుంటారో వేచి చూడాలి.