
వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ నాయకులకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. జగన్ తీసుకునే ఒక్కో నిర్ణయం చంద్రబాబు సైతం తల పట్టుకునేలా చేస్తుంది. జగన్ ప్రవేశపెట్టె సంక్షేమ పథకాలు ప్రజల్లోకి దూసుకుపోతుంటే దిక్కుతోచని స్థితిలో టీడీపీ నాయకులంతా బిక్క మొహం వేస్తున్నారు.
ఒకవైపు పార్టీలోని నాయకులంతా ఖాళీ చేస్తుంటే…మరోవైపు జగన్ పథకాలు ప్రజల్లోకి వెళ్లి మంచి పేరు సంపాదిస్తున్నాయి. అటు పార్టీని బలోపేతం చేసుకోవాలా ఇటు జగన్ పధకాలని ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాల అనే గందరగోళంలో బాబుగారు సతమతమవుతున్నారు. దీనికి తోడు రాజధాని విషయం బాబుగారికి పెద్ద సమస్య అయిపోయింది. కొన్న భూములు ఎక్కడ ధర తగ్గుతాయో అని రాజధాని తరలింపు ఆపాలని నానా తంటాలు పడుతున్నాడు.
జగన్ మాత్రం హాయిగా నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ రాజధాని ఉద్యమాలు అతనికి చీమ కుట్టినట్టుగా కూడా లేవేమో…ఈరోజు చిత్తూరు మీటింగులో కూడా చక్కగా నవ్వుతూ కూర్చుంన్నాడు.
బాబుగారు ఐదు సంవత్సరాలు కష్టపడి వేసుకున్న లెక్కలన్నీ ఒక్క దెబ్బతో చెల్లాచెదురు చేసాడు. లెక్కలన్నీ పారదర్శకంగా ఉంటె ఎవరేం చేయలేరు కానీ మన బాబుగారి లెక్కలో కావలసినన్ని బొక్కలు ఉన్నాయి. ఇంకా జగన్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి అన్నిటిని బయటికి తీయటం తప్ప. బాబుగారు చేసిన అన్ని పథకాలు మీద సమీక్షలు అవసరమైన అన్ని చోట్ల రివర్స్ టెండరింగు పద్దతి.
ఇన్ని చేస్తుంటే బాబుగారు మాత్రం కుదురుగా ఎలా ఉంటాడు, జగన్ ని ఆపటానికి సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే జగన్ కేసులు ఎప్పుడు పూర్తి అవుతాయా..ఎప్పుడు జైలుకి వెళ్తాడా…అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.