
కూకట్ పల్లి నియోజకవర్గంలో చిత్తారమ్మ బస్తీలో 108 డబుల్ బెడ్ ఇండ్లను తెలంగాణ ముఖ్యమంత్రి గారి తనయుడు మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించారు. అక్కడ పండగ వాతావరణం నెలకొన్నదని కూడా ట్వీట్ చేశారు.
అయ్యా మంత్రిగారు.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు లక్షల్లో డబుల్ బెడ్‍రూం ఇళ్లను నిర్మిస్తామని మీ తండ్రిగారు హామీ ఇచ్చారు. 2015 అక్టోబర్‌లో ప్రభుత్వం తరుపున పథకాన్ని ఘనంగా ప్రకటించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లతో మోడల్ కాలనీ నిర్మించి మార్చి 5, 2016న అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత మీ తండ్రిగారి, మీ మామ హరీశ్‌రావు గారి, ఇంకా మీరు ప్రాతినిధ్యం నియోజకవర్గాల్లో తప్ప డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ఎక్కడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు సారూ..!
మీ టీఆర్ఎస్ సర్కారు నాలుగేళ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు నత్తకే నడక నేర్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇండ్లు పునాది దశలోనే మగ్గుతున్నాయి. మీరు శంకుస్థాపన చేసింది 108 అండి.. లక్ష ఎనభై వేల ఇండ్లు శంకుస్థాపన చేసినట్లుగా ఫీల్ అయితే ఎలా..? “పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది” అంటున్నారు..! 2015 నుండి తెలంగాణలోని గూడు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని మీ తండ్రిగారు పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వివిధ దశల్లో 2లక్షల 82వేల 416 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు ఎన్ని ఇల్లులు కట్టారండి..? మీ ప్రభుత్వం ప్రకటించిన రేట్లు తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల అంతులేని నిర్లక్ష్యం, సరిపడా నిధులు లేకపోవడం, స్థలాల కొరత తదితర కారణాలతో పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. సామాన్యుల సొంతింటి కలలు క్రమంగా కరిగిపోతున్నాయి తప్పా.. మీ మనసులు మాత్రం కరగడంలేదు.
Ministers @KTRTRS and @chmallareddyMLA inaugurated the newly constructed 2 BHK dignity houses at Chittaramma Nagar Basthi, Balanagar. A total of 108 dignity houses have been constructed at a cost of Rs. 9.34 crores. pic.twitter.com/7hBjjcnMfw
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 14, 2019