హైదరాబాద్ మూడు ముక్కలవుతుందా?

హైదరాబాద్ నగరం ప్రస్తుతం జిహెచ్ఎంసి నగర పాలక సంస్థగా వుంది. అయితే ఇది ప్రస్తుతం పరిపాలనాపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదురుకుంటుంది. జనాభా పరంగా ప్రస్తుత అంచనాలప్రకారం కోటి దాటింది . ఈ సైజు లో వున్న ఇతరనగరాలు చూస్తే అధికార వికేంద్రీకరణ జరిగిందని చెప్పొచ్చు. ఉదాహరణకు ఢిల్లీని తీసుకుంటే మూడు కార్పొరేషన్లుగా విభజించబడి వుంది. ముంబై కూడా థానే , ఇంకా మరికొన్ని నగరాలుగా విడిపోయివుంది. కలకత్తా కూడా అంతే . కలకత్తా తో పాటు హౌరా […]

Written By: admin, Updated On : February 8, 2020 10:07 am
Follow us on

హైదరాబాద్ నగరం ప్రస్తుతం జిహెచ్ఎంసి నగర పాలక సంస్థగా వుంది. అయితే ఇది ప్రస్తుతం పరిపాలనాపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదురుకుంటుంది. జనాభా పరంగా ప్రస్తుత అంచనాలప్రకారం కోటి దాటింది . ఈ సైజు లో వున్న ఇతరనగరాలు చూస్తే అధికార వికేంద్రీకరణ జరిగిందని చెప్పొచ్చు. ఉదాహరణకు ఢిల్లీని తీసుకుంటే మూడు కార్పొరేషన్లుగా విభజించబడి వుంది. ముంబై కూడా థానే , ఇంకా మరికొన్ని నగరాలుగా విడిపోయివుంది. కలకత్తా కూడా అంతే . కలకత్తా తో పాటు హౌరా , సాల్ట్ లేక్ లాంటి నగరాలుగా వికేంద్రీకరించబడివుంది. మరి హైదరాబాద్ కూడా ఆ దిశగా పయనిస్తుందా?

ఈరోజు కొత్త పురపాలక చట్టాన్ని తెలంగాణా రాష్ట్ర కాబినెట్ అమోదించబోతుంది. ఆ తర్వాత రేపు, ఎల్లుండి రాష్ట్ర శాసన సభ, మండలి ద్వారా చట్టం చేయబోతున్నారు. అయితే దీనిపై నిపుణులు ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈరోజు ఆమోదించే పురపాలక చట్టం హైదరాబాద్ నగరానికి వర్తించదు. జిహెచ్ఎంసి కి ప్రత్యేక చట్టం వుంది. అయితే ఈరోజు ఆమోదించే చట్టం లోకి శివారు ప్రాంతాల్లో కొత్తగా పంచాయితీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన చాలా ప్రాంతాలు వున్నాయి. ఒకవేళ గనుక హైదరాబాద్ నగరాన్ని వికేంద్రీకరణ చేసి ఎక్కువ కార్పొరేషన్లు చేసేటట్లయితే ఈ శివారు మునిసిపాలిటీలను అందులో విలీనం చేయాలనే ఆలోచన కూడా వుంది. అందుకే వీటి భవిష్యత్తు ఈరోజు తేలనుంది.

కొంతమంది నిపుణులు చెప్పేదాన్నిబట్టి హైదరాబాద్ ని హైదరాబాద్, హైదరాబాద్ తూర్పు, హైదరాబాద్ పశ్చిమంగా మూడు కార్పొరేషన్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు విభాగం ఆ విధంగానే విభజించబడింది. అయితే దీనిపై ఇప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఒకవేళ వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల లోపు చేసేటటట్లయితే శివారు ప్రాంతాల మున్సిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు జరపరు. ఇంకో అయిదు సంవత్సరాల తర్వాత విభజించేటట్లయితే శివారు ప్రాంతాల పురపాలక సంఘాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. అది ఈరోజు తెలిసిపోతుందని భావిస్తున్నారు. ఏమైనా హైదరాబాద్ మూడుగా విభజించటం ఖాయమని అయితే అది ఇప్పుడా లేక అయిదు సంవత్సరాల తర్వాతనా అనేదే తేలాల్సివుందని నిపుణులు చెబుతున్నారు. వేచి చూద్దాం మరి.