Rashmika Mandanna Diet Secrets: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల మయం. అందులో హీరోయిన్ అంటేనే గ్లామర్ మయం. అందమంతా పోత పోసినట్టు హీరోయిన్ రూపురేఖలు చెక్కు చెదరనట్టు ఉండాలి. ఆమె ఎంత గొప్ప సుందరాంగి అయినా.. సినిమా సినిమాకి తన అందాన్ని పెంచుకుంటూ పోవాలి. అందుకే.. ప్రతి హీరోయిన్ తెరమీద మరింత గ్లామర్ గా కనిపించడానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు ఫాలో అవుతూ రకరకాలుగా ట్రై చేస్తుంటుంది.
హీరోయిన్ల తాపత్రయానికి తగ్గట్టు.. ప్రేక్షకులు సైతం ఎప్పటికప్పుడు వారి నుంచి కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే హీరోయిన్స్ కూడా తమ ఫిజిక్ ను పెర్ఫెక్ట్ గా మైంటైన్ చేయడానికి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అవుతున్నారు. ‘రష్మిక మందన్నా’.. పేరులోనే హోమ్లీ నెస్ ఉంది, తన పేరుకి తగ్గట్టుగానే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎప్పటికప్పుడు కవ్విస్తూ ఉంటుంది ఈ స్మాల్ బ్యూటీ.
Also Read: Tollywood Best Female Characters: ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ ‘హీరోయిన్ పాత్రలు’ ఇవే.. ఎందుకంటే ?
మరి, ‘రష్మిక మందన్న’ తన గ్లామర్ కోసం ఎలాంటి బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుందో తెలుసుకుందాం.
ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీళ్లతో రష్మిక డైలీ డైట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మసాలా టీ, లేదా కాఫీ తాగుతుంది. బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోసె లాంటి వాటితో పాటు రెండు ఎగ్స్ తింటుంది. లంచ్ కి మధ్యలో డ్రై ఫ్రూట్స్ తో పాటు కొబ్బరి నీళ్లు తాగుతుంది. మధ్యాహ్న భోజనంలోకి రష్మిక కచ్చితంగా బీట్రూట్, క్యారెట్, లేదా కీరా ఉండేలా చూసుకుంటుంది.
కొంచెం రైస్ లోకి పనీర్ తీసుకుంటుంది. తన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ పనీర్, పప్పుల ద్వారానే అందుతాయని చెబుతుంది ఈ క్రేజీ బ్యూటీ. నైట్ భోజనంలో భాగంగా రష్మిక పప్పు, అన్నం, కూరగాయలు తింటుంది. సాయంత్రం ఏదైనా టోస్ట్ లేదా శాండ్ విచ్ తింటుంది. రోజంతా మధ్యమధ్యలో ప్రోటీన్ షేక్ తాగుతుంది. సాయంత్రం మాత్రం ఎర్ల్ గ్రే టీ తాగుతుంది.
రష్మిక సౌందర్య ఉత్పత్తుల గురించి:
రష్మిక బ్యూటీ సీక్రెట్ ఏమిటంటే .. ఐఎస్ అనే బ్రాండ్ కు చెందిన సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఆమె ఉపయోగిస్తోంది.
Also Read: Governar Amith Shaw: మోడీ, అమిషాతో తమిళిసై భేటి.. కేసీఆర్ కు చిక్కులేనా?
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Rashmika mandanna diet plan secrets
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com