ఇటీవల ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, జిల్లాల మార్పులు చేర్పులు చేసింది. అటూ ఇటూ మార్పులు చేసి ప్రజలకు సౌలభ్యం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రజల సౌలభ్యం, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా.., మదనపల్లి కేంద్రంగా ఒక జిల్లా.. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది..
సీఎం చంద్రబాబు ప్రకటన ప్రకారం, గత కొద్ది రోజులుగా ఈ అంశంపై అధ్యయనం చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో హేతుబద్ధత లేకుండా జిల్లాలను విభజించారనే విమర్శల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేపట్టింది.
జిల్లాల ఏర్పాటుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు , ఒక మండల కేంద్రం ఏర్పాటు కానుంది. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడనున్న ఈ జిల్లాలో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. రంపచోడవరం, దేవి పట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు. చింతూరు డివిజన్ లో ఎటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం మండలాలు.
కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి, కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
అయితే, ఈ జిల్లాల మార్పు చేర్పుల అంశంలో నెల్లూరు వాసుల్ని వైఎస్సార్సీపీ రెచ్చగొడుతోందనే విషయం కూడా వార్తల్లో ఉంది. స్థానిక ప్రజలకు మెరుగైన పరిపాలనా సౌలభ్యం అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
జిల్లాల మార్పు చేర్పులపై నెల్లూరు వాసుల్ని రెచ్చగొడుతున్న వైఎస్సార్సీపీ .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.