Pawan Kalyan : వైఎస్ షర్మిల.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనురాగాల చెల్లి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఆవిడ రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్ టీపీ, నుంచి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలి వరకూ సాగింది. నిన్న తిరుపతి వారాహి డిక్లరేషన్ సభపై ఆవిడ విరుచుకుపడింది.
వైఎస్ షర్మిల ట్విట్టర్ చూస్తే.. ‘అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి వేషం భాష రెండూ మారాయి. సెక్యూలర్ జనసేన రైటిస్ట్ పార్టీగా మారింది. బాధ్యతగల పదవిలో ఉండి ఒక మతానికి చెందిన వేషం వేసుకొని.. ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే ఇతర మతాల వారికి అభద్రతభావం ఉండదా? ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా? ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా? మతం రాజకీయం చేయడం ఆర్ఎస్ ఎస్ సిద్ధాంతం అయితే అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ అయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ డైరెక్షన్ లో యాక్టింగ్ చేసే మీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మణిపూర్ లో ఊచకోత కోసింది బీజేపీ కాదా? అటువంటి పార్టీకి మద్దతిచ్చిన మీరు లౌకిక వాదం పాటించాలని చెబితే నమ్మమంటారా? ఈ దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ వేల కి.మీల పాదయాత్ర చేశారు. వారిపై మీ కామెంట్ చేసి మీ విలువ తగ్గించుకోవద్దు’ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
Dear @PawanKalyan Pawan Kalyan garu, one swallow does not make a summer, and one stroke of victory cannot be an eternal measure to your power and authority. Your remarks in Tirupati, yesterday, targeting @RahulGandhi Shri Rahul Gandhi ji, is baseless and unacceptable. The… pic.twitter.com/YocqvvdSzk
— YS Sharmila (@realyssharmila) October 4, 2024
అయితే పవన్ మారలేదు. పవన్ ఎప్పుడూ సనాతన వాదినే.. ఇలాంటి బట్టలు వేసుకునే అలవాటు ఎప్పటి నుంచో ఉంది. ఒకనాడు ఆవేశం ఉండేది.. ఇప్పుడు ఆలోచన పెరిగింది..
పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో అంతగా గింజుకోవల్సింది ఏముంది షర్మిల గారూ అంటూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.