https://oktelugu.com/

84 k house : రూ. 84 కే ఇల్లు. వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు..

గత కొంత కాలం నుంచి ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకే ప్రజలు టెన్షన్ వాతావరణంలో కాకుండా సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని కోరుకుంటున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 22, 2024 / 04:57 PM IST

    Rs. 84 k house. You can book through the website.

    Follow us on

    84 k house : గత కొంత కాలం నుంచి ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకే ప్రజలు టెన్షన్ వాతావరణంలో కాకుండా సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని కోరుకుంటున్నారు. రీసెంట్ గా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన గెలుపును అమెరికాలోని కొంతమంది పౌరులు అంగీకరించడం లేదు. అందుకే కొందరు వచ్చే ఈ నాలుగు సంవత్సరాలు కూడా వేరే ప్రదేశంలో ఉండాలి అనుకుంటున్నారట. దీంతో ట్రంప్ మస్క్‌కి అనుకూలమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా చాలా మంది అమెరికన్ పౌరులు వెళ్లిపోతున్నారు.

    ఇక ఈ పరిస్థితిని వారికి అనుకూలంగా మలుచుకోవాలని ఓ చిన్న ద్వీపం ప్రయత్నం చేస్తుంది. ఆ ద్వీపం ఏంటో కాదు ఇటాలియన్ ద్వీపం. ఇక్కడ ఉన్న సార్డినియాలోని ఓ గ్రామంలో ఈ ఆఫర్ ఉంది. ఇక ఆ గ్రామం పేరు ఒల్లైలై. ఇక్కడ 1 డాలర్‌కే ఇల్లు అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా రోజు రోజుకు తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి అక్కడి ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. విదేశీయులకు సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తుంది. ఇలా ఇతర దేశాలను ఆహ్వానిస్తుంది. తమ దేశం సురక్షితం తో పాటు అతి తక్కువ ఖర్చుతో సంతోషంగా జీవించవచ్చు అనే హామీ వారికి ఇవ్వడంతో ఇతరులు కూడా మొగ్గు చూపుతున్నారట.

    1 డాలర్‌కే ఇల్లు: అమెరికా పౌరులు గత 2 వారాల నుంచి చేస్తున్న ప్రయత్నాలను గమనించిన ఇటాలియన్ ప్రభుత్వం.. 1 డాలర్‌కే ఇల్లు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. జస్ట్ మన దేశ కరెన్సీతో పోల్చిస్తే మాత్రం కేవలం రూ.84 లకే ఇల్లు ఇస్తారు అన్నమాట. అంతేకాదు, అమెరికా నుంచి వచ్చి నివాసం ఉండే ప్రజలకు మరికొన్ని ప్రయోజనాలు అందిస్తారట కూడా.ముందుగానే బుక్ చేసుకోవడానికి ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందట ఆ ప్రభుత్వం. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ పత్రికలు, ఛానెల్లు తెలుపుతున్నాయి.

    క్రూయిజ్ లైన్: ఒల్లైలై గ్రామం ఈ విధంగా వింత ప్రకటన చేస్తే అటు అమెరికా పౌరులను ఆకట్టుకోవడానికి ఓ సంస్థ సరికొత్త ఆఫర్‌ని తెలిపింది. అదేంటంటే, క్రూయిజ్ లైన్ సంస్థ అయితే ఈ సంస్థ స్కిప్ ఫార్వడ్ పేరుతో ఓ అరుదైన సర్వీసును అందిస్తామని ప్రకటించింది. ఈ సర్వీసు ద్వారా అమెరికాలో ట్రంప్ పాలన ముగిసే 4 సంవత్సరాల వరకు 140 దేశాలను చూపించేలా సన్నాహాలు చేస్తుందట ఆ సంస్థ. ఈ ఆఫర్ భలే ఉంది కద.

    మొత్తం మీద ప్రజలు ఒక దేశంలో యుద్ధం వలన ఇతర దేశాలకు వెళ్తుంటే, మరో దేశంలో పరిపాలన నచ్చక వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తం మీద కొన్ని దేశాల్లో జనాభా పెరిగి ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఇలాంటి ఆఫర్ల వల్ల కొన్ని దేశాలకు ప్రజలు వెళ్తున్నారు. అంటే కొన్ని దేశాల్లో ఇల్లులు నిండితే మరికొన్ని దేశాల్లో జనాభా లేక ఇళ్లు ఖాళీ అవుతున్నాయి అన్నమాట. జనాభా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు.