Yogi Adityanath education reforms : ఉత్తరప్రదేశ్.. 25 కోట్ల మంది ఉన్న యూపీ డెవలప్ అయితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. యోగీ వచ్చాకనే యూపీ అభివృద్ధి పథంలో ముందుకెళుతుంది. యూపీలో విద్యారంగంలో సాగుతున్న నిశ్శబ్ధ విప్లవం గురించి తెలుసుకుందాం.
యూపీలో మాఫియా, రౌడీ రాజ్యంతో పరీక్షలు మొత్తం కాపీ జరిగేవి. అత్యంత నిరాక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నే. స్కూళ్లు లేవు. టీచర్లు లేరు. కనీస సదుపాయాలు స్కూళ్లలో లేవు. యోగీ రాగానే స్కూళ్ల ను మెరుగుపరిచాడు.
‘ఆపరేషన్ కాయకల్ప’ అనే పేరుతో 19 పేరామీటర్స్ తో లక్షా 33 వేల పాఠశాలలను బాగు చేయాలని నిర్ణయించారు. 1 కోటి 90 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 12వేల కోట్లను విద్యారంగంపై ఖర్చు పెట్టారు. 96 శాతం సక్సెస్ రేటు ఉంది. 33 శాతం నుంచి 83 శాతం టాయ్ లెట్స్ ను పునరుద్దరించారు. సగానికి పైగా స్కూళ్లకు కరెంట్ లేదు. ఇప్పుడు 80 శాతానికి పైగా.. సేఫ్ వాటర్, ఫర్నీచర్, స్కూళ్లకు ప్రహరీలు, కొత్త స్కూళ్లు కట్టించడాలు.. స్కూళ్లను రినవేట్ చేశారు. 78 శాతానికి లైబ్రరీలను పెంచారు.స్మార్ట్ క్లాసులు 25వేల క్లాసులు రూపొందించారు. ల్యాబ్స్ ఐదున్నరవేల కు పెంచారు. రెండున్నర లక్షల ట్యాబులు విద్యార్థులకు ఇచ్చారు. స్పోర్ట్స్ కిట్స్ విద్యార్థులకు ఇచ్చారు.
మిడ్ డే మీల్స్, మధ్యాహ్నం భోజనం బాగా బలోపేతం చేశారు. 96 శాతం స్కూల్స్ కు అమలు చేస్తున్నారు. ప్రతీ విద్యార్థికి 1200 రూపాయలు ఇస్తున్నారు.
ప్రాథమిక విద్య సంస్కరణల కోసం కత్తి మీద సాము చేస్తున్న యోగి పాలనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి
