https://oktelugu.com/

BJP in Naxalbari : నక్సల్ బరీలో ఎర్రజెండాల బదులు కాషాయ జెండాలు ఎగురుతున్నాయి

నక్సల్ బరీలో ఎర్రజెండాల బదులు కాషాయ జెండాలు ఎగురుతున్నాయి.. అక్కడి రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2024 / 01:40 PM IST

    BJP in Naxalbari : నక్సల్ బరీ.. ఈ పేరు పాతతరం వాళ్లకు తెలుసు.. కొత్త వాళ్లకి నక్సలైట్ అన్న పదం వింటూ ఉంటారు. 1967లో నక్సలైట్ ఉద్యమం పుట్టిందే ఈ నక్సల్ బరీ నుంచి.. మావోయిస్టు ఉద్యమానికి మారుపేరుగా ఒకప్పుడు ఇది వర్ధిల్లింది. పశ్చిమ బెంగాల్ లో సిలిగురి పక్కన 22 కీ.మీలు వాయువ్యంగా ఉండేటువంటి నక్సల్ బరీ ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఇదొక సెమీ అర్బన్ టౌన్.

    అప్పట్లో గ్రామీణ ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ నక్సల్ బరీలో ఎర్రజెండాల బదులు కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. డార్జలింగ్ లోక్ సభకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. డార్జలింగ్ లోని మాతిగర నక్సల్ బరీ అనే అసెంబ్లీలో ఈ నక్సల్ బరీ ఉంది.

    2009లో నియోజకవర్గాల విభజనలో మాతిగర నక్సల్ బరీ ఏర్పడింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2016లో కాంగ్రెస్ గెలిచింది. 2021లో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఇది ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గం. ఆదివాసీలు, ఎస్సీలు కలిపి ఉన్నారు.

    నక్సల్ బరీలో ఎర్రజెండాల బదులు కాషాయ జెండాలు ఎగురుతున్నాయి.. అక్కడి రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.