Rahul Gandhi : రాహుల్ గాంధీని కావాలనే రెచ్చగొట్టి నిలబెట్టారా?

రాహుల్ గాంధీని కావాలనే రెచ్చగొట్టి నిలబెట్టారా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 10, 2024 5:46 pm

Rahul Gandhi : రాయ్ బరేలి ఎన్నిక రోజురోజుకు ఆసక్తికరంగా మారింది. 20వ తేదీన పోలింగ్ జరగనుంది. అసలు రాహుల్ గాంధీకి ఇష్టం లేకున్నా బలవంతంగా పోటీకి దిగాడని సమాచారం. ప్రియాంక గాంధీని పోటీచేయకుండా అడ్డుకునేందుకే రాహుల్ చివరి వరకూ అట్టిపెట్టి పోటీకి దిగాడని ఆరోపణలు వస్తున్నాయి.

ఆచార్య ప్రమోద్ కృష్ణ అనే మాజీ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. ఆచార్య ప్రమోద్ చెప్పిన ప్రకారం.. రాహుల్ గాంధీనే ప్రియాంకను తొక్కేసి టికెట్ ఇవ్వలేదు అన్నది ప్రధాన ఆరోపణ.. రాహుల్ కుటుంబంలో విభేదాలున్నాయన్నా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత: పురంలో గొడవలు ఉన్నాయని అంటున్నారు.

రాహుల్ గాంధీకి రాయ్ బరేలిలో పోటీ సరైన చర్యనా? అమేథిని ఎంచుకోకుండా రాయ్ బరేలిలో పోటీకి దిగడం ఏ రకంగా మంచి వ్యూహమో అర్థం కావడం లేదు. వయానాడ్ మాత్రమే పోటీ చేస్తానని చెప్పి మళ్లీ ఆ ఎన్నిక ముగిశాక రాయ్ బరేలి లో పోటీకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాయ్ బరేలిలో రాహుల్ ఓడిపోతే ఆయన రాజకీయ జీవితమే సమాధి అవుతుంది.

రాహుల్ గాంధీని కావాలనే రెచ్చగొట్టి నిలబెట్టారా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.